ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జగన్‌కు మంచిపేరు వస్తుందనే కోనసీమలో హింస’

ABN, First Publish Date - 2022-05-26T07:02:42+05:30

అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు కొనసాగితే ముఖ్య మంత్రి సీఎం జగన్‌కు మంచిపేరు వస్తుందన్న భయంతోనే టీడీపీ, జనసేన పార్టీల నాయకులు రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యేల గృహాలపై దాడులు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌శాఖా మంత్రి బూడి ముత్యాలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పట్టాల పంపిణీలో మాట్లాడుతున్న మంత్రి బూడి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీడికాడ, మే 25 : అమలాపురం కేంద్రంగా కోనసీమ జిల్లాకు అంబేద్కర్‌ పేరు కొనసాగితే ముఖ్య మంత్రి సీఎం జగన్‌కు మంచిపేరు వస్తుందన్న భయంతోనే టీడీపీ, జనసేన పార్టీల నాయకులు రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యేల గృహాలపై దాడులు చేస్తున్నారని  ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్‌శాఖా మంత్రి బూడి ముత్యాలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కోనాం పంచాయతీలో రెండు గిరిజన గ్రామాలకు చెందిన 11మంది గిరిజన రైతులకు సుమారు 27ఎకరాల పోడు వ్యవసాయ భూమికి బుధవారం ఇక్కడ పట్టాలను పంపిణీ చేసి మాట్లా డారు.  టీడీపీ, జనసేన పార్టీలు అంబేడ్కర్‌ పేరును ఆ జిల్లాకు పెట్టాలని కోరడంతో కేబినెట్‌ సమావేశంలో చర్చించి, ఆ జిల్లాకు అంబేడ్కర్‌ జిల్లాగా పేరు మార్చామన్నారు. సీఎంకు మంచిపేరు వస్తుందన్న భయంతోనే ఈ విధంగా హింస సృష్టి స్తున్నారని ఆరోపించారు.  జడ్పీ సాంఘిక సంక్షేమ శాఖ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ ఈర్లె అనూరాధ, వైస్‌ ఎంపీపీ కిమిడి చిన్నమ్మలు, తహసీల్దార్‌ ఎస్‌.వి. అంబేడ్కర్‌, ఎంపీడీవో జయప్రకాశరావు, మాజీ సర్పంచ్‌ చలుగు అప్పలనాయుడు, వైసీపీ నాయ కులు గొల్లవిల్లి రాజబాబు, సతీష్‌వర్మ, యర్రా అప్పారావు, జానకీరామ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-26T07:02:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising