ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎరువుల దుకాణంపై విజిలెన్స్‌ దాడులు

ABN, First Publish Date - 2022-07-03T06:22:38+05:30

విశాఖ జిల్లా పద్మనాభం మండలం అనంతవరం గ్రామంలోని శ్రీవెంకటలక్ష్మి కిరాణా అండ్‌ జనరల్‌ స్టోర్స్‌ పేరుతో నిర్వహిస్తున్న ఎరువుల దుకాణంపై విజిలెన్స్‌ అధికారులు శనివారం ఆకస్మికంగా దాడిచేసి రూ.10 లక్షల విలువైన 51 టన్నుల ఎరువులను సీజ్‌ చేశారు.

అనంతవరంలోని ఎరువుల దుకాణం వద్ద విజిలెన్స్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.10 లక్షల విలువైన 51 టన్నుల ఎరువులు సీజ్‌

పద్మనాభం/పద్మనాభం రూరల్‌, జూలై 2: విశాఖ జిల్లా పద్మనాభం మండలం అనంతవరం గ్రామంలోని శ్రీవెంకటలక్ష్మి కిరాణా అండ్‌ జనరల్‌ స్టోర్స్‌ పేరుతో నిర్వహిస్తున్న ఎరువుల దుకాణంపై విజిలెన్స్‌ అధికారులు శనివారం ఆకస్మికంగా దాడిచేసి రూ.10 లక్షల విలువైన 51 టన్నుల ఎరువులను సీజ్‌ చేశారు. విశాఖ విజిలెన్స్‌ ఎస్పీ జి.స్వరూపారాణి ఆధ్వర్యంలో సిబ్బంది ఈ దాడులు చేశారు.


ఎస్పీ కథనం మేరకు... పర్లంకి చిట్టిబాబు అనే వ్యాపారి గ్రామంలో ప్రభుత్వ అనుమతితో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్నాడు. అయితే రైతుల నుంచి ఎమ్మార్పీ కంటే రూ.60లు అదనంగా డీఏపీ బస్తా విక్రయిస్తున్నాడని గుర్తించారు. రైతులకు విక్రయించినట్లు తప్పుడు బిల్లులు చూపించి 40 టన్నుల డీఏపీ అనధికారికంగా నిల్వ చేశాడని గుర్తించారు. అలాగే యూరియా, ఇతర ఎరువులు మరో పదకొండు టన్నులు అక్రమ నిల్వలని మొత్తం 51 టన్నులు సీజ్‌ చేశారు.


స్టాంపింగ్‌ లేకుండా తూనిక యంత్రం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీంతో చిట్టిబాబుపై అక్రమ నిల్వలు, లీగల్‌ మెట్రాలజీ చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ స్వరూపరాణి తెలిపారు. ఈ దాడిలో డీఎస్పీ అన్నెపు నర్శింహమూర్తి, ఏఏవో కృష్ణవేణి, వ్యవసాయ సహాయకులు సింహాచలం, సిబ్బంది మహేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T06:22:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising