ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజాధిరాజుగా వెంకన్న

ABN, First Publish Date - 2022-01-17T06:43:01+05:30

టా కనుమ పండగ రోజు మాత్రమే ఉపమాక వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో రాజాధిరాజ అలంకరణలో స్వామివారు గిరి ప్రదక్షిణ చేస్తూ భక్తులకు దర్శనమివ్వడం ఆనవాయితీ. అయితే కొవిడ్‌ నేపథ్యంలో టీటీడీ ఆదేశాల మేరకు స్వామివారి గిరి ప్రదక్షిణోత్సవాన్ని ఈ ఏడాది కూడా రద్దు చేశారు. అర్చకులు మాత్రం సంప్రదాయం ప్రకారం ఆదివారం రాజాధిరాజుగా స్వామివారిని ఆలయ గర్భగుడిలోనే అలంకరించి, భక్తులకు దర్శనభాగ్యాన్ని కల్పించారు.

రాజాధిరాజుగా దర్శనమిస్తున్న ఉపమాక వెంకన్న
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నక్కపల్లి, జనవరి 16: ఏటా కనుమ పండగ రోజు మాత్రమే ఉపమాక వేంకటేశ్వరస్వామి క్షేత్రంలో రాజాధిరాజ అలంకరణలో స్వామివారు  గిరి ప్రదక్షిణ చేస్తూ భక్తులకు దర్శనమివ్వడం ఆనవాయితీ. అయితే కొవిడ్‌ నేపథ్యంలో టీటీడీ ఆదేశాల మేరకు స్వామివారి గిరి ప్రదక్షిణోత్సవాన్ని ఈ ఏడాది కూడా రద్దు చేశారు.   అర్చకులు మాత్రం సంప్రదాయం ప్రకారం ఆదివారం రాజాధిరాజుగా స్వామివారిని ఆలయ గర్భగుడిలోనే అలంకరించి, భక్తులకు దర్శనభాగ్యాన్ని కల్పించారు.  అనంతరం పుష్కరిణి వద్ద వున్న లంకవారి రాతి మండపం వద్ద కరి, మకరి సంవాదం నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు గొట్టుముక్కల ప్రసాదాచార్యులు, అర్చకులు శేషాచార్యులు, కృష్ణమాచార్యులు, గోపాలాచార్యులు, శ్రీనివాసాచార్యులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో గోపూజ కూడా జరిపారు. 

 పాండురంగ ఆలయంలో తోట ఉత్సవం

పాయకరావుపేట : ఇక్కడి పాండురంగ దేవ స్థానంలో   తోట ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. తొలుత ప్రధానార్చకులు యి.కృష్ణ స్వామి, నారా యణాచార్యులు  వేకువజామునే స్వామికి  పూజలు జరిపారు.  సాయంత్రం సుం దరంగా అలంకరించిన స్వామి, అమ్మవార్లను పల్లకిపై ఉంచి తోట ఉత్సవాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తిలకించారు. 

Updated Date - 2022-01-17T06:43:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising