వైసీపీ ప్రచారకర్తలుగా వెలుగు ఉద్యోగులు
ABN, First Publish Date - 2022-12-31T00:10:24+05:30
వెలుగు సిబ్బంది వైసీపీ ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ, జనసేన, సీపీఐ నాయకులు ధ్వజమెత్తారు. ఆయా పార్టీల నేతలు కొట్టేటి భాస్కరావు, సాగిన బుజ్జిబాబు, గండేపల్లి నూకరాజు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.
సీఎం సభలకు భయపెట్టి జనాల తరలింపు
అధికారేతర పక్షాల నాయకులు ధ్వజం
కొయ్యూరు, డిసెంబరు 30: వెలుగు సిబ్బంది వైసీపీ ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ, జనసేన, సీపీఐ నాయకులు ధ్వజమెత్తారు. ఆయా పార్టీల నేతలు కొట్టేటి భాస్కరావు, సాగిన బుజ్జిబాబు, గండేపల్లి నూకరాజు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ సభ విజయవంతం చేసేందుకు వెలుగు సిబ్బంది ప్రవర్తించిన తీరును తప్పు పట్టారు. డ్వాక్రా మహిళలు ముఖ్యమంత్రి సభకు వెళ్లడానికి విముఖత వ్యక్తం చేస్తే, వారిని పలు విధాలుగా భయాందోళనలకు గురిచేసి మరీ బస్సులు ఎక్కిరించారని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలుగా మారి సభలను విజయవంతం చేసేందుకు శ్రమ పడడం విడ్డూరమన్నారు. వెలుగు సిబ్బంది ప్రవర్తించిన తీరుపై సాక్ష్యాధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. ఉద్యోగులు ఏదో పార్టీకి వత్తాసు పలికేలా విధులు నిర్వహించడం సరికాదని, నైతిక విలువలను పాటిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. లేనిపక్షంలో ప్రజాగ్రహానికి గురికాకతప్పదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.
Updated Date - 2022-12-31T00:14:56+05:30 IST