ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ సమన్వయకర్త పదవి నుంచి తప్పుకుంటున్నా: MLA వాసుపల్లి

ABN, First Publish Date - 2022-06-04T21:05:52+05:30

Vishakapatnam: విశాఖ దక్షణ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త పదవి నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Vishakapatnam: విశాఖ దక్షణ నియోజకవర్గ సమన్వయకర్త పదవి నుంచి తాను వైదొలుగుతున్నట్లు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఉత్తరాంద్ర జిల్లాల సమన్వయకర్త వై.వి సుబ్బారెడ్డికి,  నగర అధ్యక్షుడు అవంతి శ్రీనివాస్‌కు లేఖ రాశారు. సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే తనకు బలనిరూపణ పెట్టడం తన గౌరవానికి భంగం కలిగించిందని, అలాగే వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుంచి తప్పుకుంటున్నానని లేఖలో పేర్కొన్నారు.


కాగా.. వాసుపల్లి గణేష్ కుమార్ 2009లో టీడీపీ నుంచి పోటీచేసి ఓడిపోయారు. తదనంతరం టీడీపీ విశాఖ దక్షణ సమన్యయకర్తగా కొనసాగుతూ.. కాంగ్రెస్ పార్టీ హయంలో ఆ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను గట్టిగా ఎండగట్టారు. దీంతో వాసుపల్లికి చంద్రబాబు.. టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి అప్పగించారు. ఆ పదవిలో దాదాపు చాలా సంవత్సరాలు కొనసాగారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలవ్వడంతో వాసుపల్లి.. వైసీపీకి మద్దతిచ్చి.. తన కుమారులిద్దరికీ సీఎం వైఎస్ జగన్ చేత వైసీపీ కండువాలు కప్పించారు. దీంతో ఆయనకు సమన్వయకర్త పదవిని వైసీపీ అధిష్టానం కట్టబెట్టింది. ఆ పదవికే ఈయన ఇవాళ రాజీనామా చేశారు.



Updated Date - 2022-06-04T21:05:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising