ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌బీఐ సేవలను వినియోగించుకోండి

ABN, First Publish Date - 2022-09-13T05:44:21+05:30

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌బీఐ విశాఖ డీజీఎం మాన్య పాండే కోరారు.

కార్యక్రమంలో మాట్లాడుతున్న డీజీఎం మాన్య పాండే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్యాంక్‌ విశాఖ డీజీఎం మాన్య పాండే

ఆటోనగర్‌, సెప్టెంబరు 12: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్‌బీఐ విశాఖ డీజీఎం మాన్య పాండే కోరారు. సోమవారం బ్యాంక్‌ ఆద్వర్యంలో విశాఖ ఆటోనగర్‌ స్మాల్‌ స్కేల్‌ ఇండస్ట్రీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో పరిశ్రమల నిర్వాహకులకు నిర్వహించిన ఎస్‌బీఐ ఎస్‌ఎంఈ ఉత్సవ్‌ అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పారిశ్రామికవేత్తలనుద్దేశించి మాట్లాడుతూ మైక్రో ఇండస్ట్రీస్‌ మొదలుకొని అన్ని రకాల పరిశ్రమలకు ఆర్థికంగా తోడ్పాటు అందించేందుకు ఎస్‌బీఐ ముందుంటుందన్నారు. ఎస్‌బీఐ ఆర్‌ఎం తపోదన్‌ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు అభివృద్ధి చెందేందుకు బ్యాంకులు అన్ని విధాలుగా సహకరించాలన్న ప్రభుత్వ ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని తమ బ్యాంక్‌ ప్రోత్సాహకాలను అందించేందుకు సిద్ధంగా వుందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. వాసీవా అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శులు ఏకే బాలాజీ, కృష్ణప్రసాద్‌, డి.వినోద్‌ మాట్లాడుతూ పరిశ్రమల నిర్వాహకులకు తోడ్పాటునందించేందుకు ఎస్‌బీఐ ముందుకు రావడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ ఏజీఎం రామకృష్ణ, ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్‌ జీవీఆర్‌ నాయుడు, రవీంద్రకుమార్‌, వివిధ పరిశ్రమల పారిశ్రామికవేత్తలు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-13T05:44:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising