ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా రవాణాను వారానికి ఒకరోజు వినియోగించాలి

ABN, First Publish Date - 2022-07-19T05:29:52+05:30

కాలుష్య నియంత్రణలో భాగంగా నగరవాసుల్లో ప్రతిఒక్కరూ వారానికి ఒకరోజైనా సొంతవాహనాన్ని పక్కన పెట్టి ప్రజా రవాణా వాహనాలను వినియోగించాలని మేయర్‌ గొల గాని హరివెంకటకుమారి విజ్ఞప్తి చేశారు.

‘నో వెహికిల్‌ జోన్‌’ నిబంధన కారణంగా బస్సులో ప్రయాణిస్తూ టికెట్టు కొనుగోలు చేస్తున్న మేయర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నగరవాసులకు మేయర్‌ హరివెంకటకుమారి విజ్ఞప్తి

విశాఖపట్నం, జూలై 18: కాలుష్య నియంత్రణలో భాగంగా నగరవాసుల్లో ప్రతిఒక్కరూ వారానికి ఒకరోజైనా సొంతవాహనాన్ని పక్కన పెట్టి ప్రజా రవాణా వాహనాలను వినియోగించాలని మేయర్‌ గొల గాని హరివెంకటకుమారి  విజ్ఞప్తి చేశారు. జీవీఎంసీ ‘నో వెహికిల్‌ జోన్‌’ నిబంధనలో భాగంగా మూడో సోమ వారం కూడా మేయర్‌ ఆరిలోవలోని తన క్యాంపు కార్యాలయం నుంచి  బస్టాప్‌కు నడుచుకుంటూ వచ్చి బస్సులో జీవీఎంసీ కార్యాలయానికి చేరుకున్నారు.


విధుల నిర్వహణ అనంతరం తిరిగి బస్సులోనే తన క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఇంటిలో రెండు మూడు వ్యక్తిగత వాహనాలు ఉంటున్నాయని, వారానికి ఒక్కరోజు ప్రజా రవాణా వాహనాన్ని వినియోగిస్తే పర్యావరణానికి ఎంతో మేలు చేసిన వాళ్లం అవుతామన్నారు. దీనివల్ల కాలుష్య నియంత్రణకు సహకరించిన వారవుతారని చెప్పారు.ఇప్పటికే జీవీఎంసీ కమి షనర్‌ ఆదేశాలతో ఉద్యోగులు అంతా ప్రతి సోమవారం తమ వాహనాలు విడిచిపెట్టి పీటీడీ బస్సుల్లోనే కార్యాలయానికి రాకపోకలు సాగిస్తున్నారని గుర్తు చేశారు. అన్నివర్గాలు ఈ నిబంధన పాటించాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2022-07-19T05:29:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising