ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు

ABN, First Publish Date - 2022-06-29T06:21:40+05:30

నగరంలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో 25 ద్విచక్ర వాహనాలను దొంగలించిన నిందితుడిని అరెస్టు చేసినట్టు ఏడీసీపీ క్రైమ్‌ గంగాధరమ్‌ తెలిపారు.

స్వాధీనం చేసుకున్న వాహనాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

25 బైక్‌లు స్వాధీనం

మహారాణిపేట, జూన్‌ 28: నగరంలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో 25 ద్విచక్ర వాహనాలను  దొంగలించిన నిందితుడిని అరెస్టు చేసినట్టు ఏడీసీపీ క్రైమ్‌ గంగాధరమ్‌ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ మహారాణిపేట మంతావారి వీధికి చెందిన బి.సత్య తరుణ్‌కుమార్‌  జనవరి 28న బీవీకే కాలేజీలో పరీక్ష రాయటానికి వెళ్లారు. అక్కడ తన ద్విచక్రవాహనం పార్కింగ్‌ చేసి తాళం వేయడం మరిచారు. తిరిగి వచ్చేసరికి తన వాహనం కనిపించలేదు. దీంతో ద్వారకా పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో భాగంగా  ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ వద్ద  చేపల ఉప్పాడ ప్రాంతానికి చెందిన చినమామ ఎల్లాజీని అదుపులోకి తీసుకొని విచారించారు.  నగరంలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో మొత్తం 25 ద్విచక్ర వాహనాలను దొంగిలించినట్టు నిందితుడు అంగీకరించాడు. అతని వద్ద నుంచి వాహనాలను స్వాధీనం చేసుకొని, అరెస్టు చేశారు.


Updated Date - 2022-06-29T06:21:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising