ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు పదో తరగతి విద్యార్థులు అదృశ్యం

ABN, First Publish Date - 2022-10-17T07:05:27+05:30

నర్సీపట్నం ప్రాంతానికి చెందిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పట్టణ పోలీసులకు ఫిర్యాదు 

నర్సీపట్నం, అక్టోబరు 16: నర్సీపట్నం ప్రాంతానికి చెందిన ఇద్దరు పదో తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు. పట్టణ సీఐ గణేశ్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి. నర్సీపట్నం శివపురానికి చెందిన సింహాద్రి ఎలీషారాజు కుమారుడు మనోసాక్షిత్‌ (15), చెట్టుపల్లికి గ్రామానికి చెందిన బంటు అప్పారావు కుమారుడు హర్ష వర్థన్‌ (15) స్థానిక ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. శనివారం యథావిధిగా ఇద్దరు స్కూల్‌కి వచ్చారు. సాయంత్రం స్కూల్‌ విడిచి పెట్టిన తర్వాత ఇద్దరు శివపురంలోని మనోసాక్షిత్‌ ఇంటికి వచ్చారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఇద్దరు ఇంటి నుంచి బయటకు వచ్చారు. వారు ఎంత సేపటికీ రాకపోవడంతో బంధువులు ఆదివారం ఉదయం వరకు గాలించారు.వారి ఆచూకీ లేకపోవడంతో హర్షవర్థన్‌ మామయ్య పచ్చికారి రాజుబాబు, మనోసాక్షిత్‌ తండ్రి ఎలీషారాజు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ గణేశ్‌ చెప్పారు.

Updated Date - 2022-10-17T07:05:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising