అమరజీవికి నివాళి
ABN, First Publish Date - 2022-12-16T01:08:53+05:30
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు అందరి మదిలో చిరస్థాయిగా నిలిచి వుంటారని కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున అన్నారు.
విశాఖపట్నం, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు అందరి మదిలో చిరస్థాయిగా నిలిచి వుంటారని కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున అన్నారు. అమరజీవి వర్ధంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు మాట్లాడే వారి కోసం ఒక రాష్ట్రం కావాలన్న పట్టుదలతో ఆమరణ దీక్ష చేసి...సాధించిన మహోన్నతుడు పొట్టి శ్రీరామలు అని కొనియాడారు. దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాలకు ఆయన ఆద్యుడని అన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కెఎస్. విశ్వనాథన్, డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి, సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ వి.మణిరామ్, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T01:08:55+05:30 IST