ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజన యువత క్రీడల్లో రాణించాలి

ABN, First Publish Date - 2022-03-05T06:16:54+05:30

గిరిజన యువత క్రీడారంగంలో రాణించాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆకాంక్షించారు.

విజేతలకు బహుమతులు అందిస్తున్న రూరల్‌ జిల్లా ఎస్పీ కృష్ణారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


రూరల్‌ ఎస్పీ క్రిష్ణారావు

పాడేరురూరల్‌, మార్చి 4: గిరిజన యువత క్రీడారంగంలో రాణించాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆకాంక్షించారు. శుక్రవారం స్థానిక సీఏహెచ్‌ స్కూల్‌ మైదానంలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువహో మెగా వాలీబాల్‌ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన యువత తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా ఉంచాలని, వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పోలీస్‌ శాఖ  చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ వాలీబాల్‌ పోటీల్లో 381 వాలీబాల్‌ జట్లు పాల్గొన్నాయి. అనంతరం ప్రథమ స్థానంలో నిలిచిన అరకు క్రీడాకారులకు రూ.50 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచిన పెదబయలు క్రీడాకారులకు రూ.25 వేలు, తృతీయ స్థానం కైవసం చేసుకున్న చింతపల్లి క్రీడాకారులకు రూ.15 వేలు నగదును అందజేశారు. ఈకార్యక్రమంలో ఓఎస్‌డీ ఎస్‌.సతీష్‌కుమార్‌, స్థానిక ఏఎస్పీ పి.జగదీష్‌, చింతపల్లి ఏఎస్పీ తుసార్‌ డుడీ, నర్సీపట్నం ఏఎస్పీ మణికంఠచందుల్‌ పాల్గొన్నారు.

 

Updated Date - 2022-03-05T06:16:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising