ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాగునీటి సమస్యపై ఆదివాసీ మహిళల ధర్నా

ABN, First Publish Date - 2022-05-23T06:09:44+05:30

మండ లంలోని డోలవానిపాలెంలో తాగు నీటి సమస్య వేధిస్తుండడంతో అక్కడి ఆది వాసీ మహిళలు ఆదివారం ఖాళీ బిదెలతో ధర్నాకు దిగారు. సమస్యను ఈ నెల 29వ తేదీలోగా పరిష్కరించకుంటే అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ కార్యా లయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అంతా హెచ్చరించారు.

ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతున్న డోలవానిపాలెం గిరిజన మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 డోలవానిపాలెంలో నాలుగు బోర్లలో మూడు పాడైనట్టు వెల్లడి 

 ఉన్న ఒక్కటి బురద నీరు వస్తుండడంతో అష్టకష్టాలు పడుతున్నామని ఆవేదన 

 ఈ నెల 29లోగా పరిష్కరించకుంటే కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఆందోళ చేస్తామని హెచ్చరిక 

 గ్రానైట్‌ తవ్వకాల వల్లే ఈ దుస్థితి అని ఆరోపణ

రావికమతం, మే 22 : మండ లంలోని డోలవానిపాలెంలో తాగు నీటి సమస్య వేధిస్తుండడంతో అక్కడి ఆది వాసీ మహిళలు ఆదివారం ఖాళీ బిదెలతో ధర్నాకు దిగారు.  సమస్యను ఈ నెల 29వ తేదీలోగా పరిష్కరించకుంటే  అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ కార్యా లయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అంతా హెచ్చరించారు. గ్రామంలో 55 గిరిజన కుటుంబాల్లో సుమారు 250 మంది గిరిజనులు నివాసం ఉంటున్నారు. ఇక్కడున్న నాలుగు తాగు నీటి బోర్లలో మూడు పూర్తిగా పనిచేయడం లేదని వాపో తున్నారు. ఉన్న ఒక్కగానొక్క బోరే ఆధారమని, దాని నుంచి కూడా బురద నీరే వస్తుండడంతో ఇబ్బం దులు ఎదుర్కొంటున్నట్టు కంటతడి పెట్టారు. ఈ సమస్యను పరిష్కరించాలని ఆర్‌ డబ్ల్యూఎస్‌ అధికారులకు, పాలకులకు పలుమార్లు విన్నవించిన ప్పటికీ ఫలి తం లేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే వేసవి కావడంతో బిందెడు నీటి కోసం అష్టకష్టాలు పడు తున్నట్టు వాపో యారు. తమ గోడును పట్టించుకునే వారు లేకపోవడంతోనే ఈ ఆందో ళనకు దిగినట్టు చెప్పారు. గ్రానైట్‌ తవ్వకాల మూలంగానే తాగునీరు కలుషితమై, బోర్లు పనికి రాకుండా పోయాయని గ్రామానికి చెందిన సింగరాపు ఈశ్వరమ్మ, ఎస్‌.వలసయ్య తదితరులు ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తమ ప్రధాన సమ స్యపై దృష్టి సారిం చాల్సిందిగా అంతా ముక్తకంఠంతో కోరుతున్నారు. 

Updated Date - 2022-05-23T06:09:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising