ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటుకు పర్యాటకం

ABN, First Publish Date - 2022-10-07T06:09:05+05:30

రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన విశాఖపట్నాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేందుకు విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) యత్నిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పది ప్రాజెక్టులను పీపీపీ విధానంలో కట్టబెట్టేందుకు సిద్ధమైన వీఎంఆర్‌డీఏ

జాబితాలో డైనోసార్‌ మ్యూజియం, థీమ్‌ పార్క్‌, వాటర్‌ వరల్డ్‌, బబుల్‌ టెంట్స్‌, గ్లాస్‌ స్కై వాక్‌, ఓపెన్‌ బస్‌ సిటీ టూరిజం

ఆసక్తి కలిగిన వారు బిడ్లు సమర్పించాలంటూ ప్రకటన

ఏడాది అనుభవం ఉంటే చాలట

ఆ ముసుగులో అధికార పార్టీ నేతలకు అప్పగించేందుకు వ్యూహం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన విశాఖపట్నాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టేందుకు విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) యత్నిస్తోంది. నగరంలో పర్యాటకానికి వీఎంఆర్‌డీఏ ఎప్పటి నుంచో తన వంతు సహకారం అందిస్తోంది. ఆర్‌కే బీచ్‌ రోడ్డులో వుడా పార్క్‌, కైలాసగిరి, ఆ కిందనే తెన్నేటి పార్క్‌, తొట్లకొండ, హెల్త్‌ ఎరీనా, సిటీ సెంట్రల్‌ పార్క్‌, తెలుగు మ్యూజియం, సబ్‌మెరైన్‌ మ్యూజియం, టీయూ-142 విమాన మ్యూజియం వంటి వాటిని నిర్మించి నిర్వహిస్తోంది. అలాగే కాపులుప్పాడలో హిస్టరీ మ్యూజియం నిర్మాణానికి నడుంకట్టింది. ఇవన్నీ వీఎంఆర్‌డీఏ తన సొంత నిధులతో నిర్మించి, సిబ్బందితో నిర్వహిస్తూ ఆదాయం సంపాదిస్తోంది. విశాఖ పర్యాటక అభివృద్ధికి దోహదపడుతోంది. అయితే ఇటీవల వైసీపీ అధికారం చేపట్టిన తరువాత వీఎంఆర్‌డీఏలో కొత్త పోకడలు మొదలయ్యాయి. పనులు, ప్రాజెక్టులు, సమావేశాలు అన్నీ  రహస్యంగా నిర్వహిస్తున్నారు. వీఎంఆర్‌డీఏ వ్యవహారాలు ఏవీ ప్రజలకు తెలియనివ్వడం లేదు. వుడా...వీఎంఆర్‌డీఏగా మారినప్పుడు బసంత్‌కుమార్‌ తొలి కమిషనర్‌గా పనిచేశారు. వారం...వారం వీఎంఆర్‌డీఏ వ్యవహారాలపై సమీక్షలు నిర్వహించి పత్రికల ద్వారా ప్రజలకు సమాచారం అందించేవారు. ఆ తరువాత వచ్చిన కమిషనర్‌ కోటేశ్వరరావు రహస్య పాలనకు శ్రీకారం చుట్టారు. రెండేళ్లు బయటకు ఏమీ తెలియనివ్వలేదు. కైలాసగిరి పునర్మిర్మాణ ప్రాజెక్టును కడప కాంట్రాక్టర్లకు అప్పగించారు. అది గడువులోగా పూర్తికాకపోవడంతో ప్రపంచ బ్యాంకు ఆర్థికసాయం ఆపేసింది. ఆయన హయాంలోనే బోర్డు నిర్ణయాలను కూడా దాచిపెట్టే విధానం మొదలైంది. ఈ క్రమంలో వీఎంఆర్‌డీఏ వెబ్‌సైట్‌ను కేవలం టెండర్‌లకే పరిమితం చేశారు. ఇరవై ఏళ్లకు ఓసారి తయారుచేసే మాస్టర్‌ ప్లాన్‌-2041ను పార్టీ పెద్దలు సూచించిన సంస్థకు అప్పగించి...అవగాహన లేకుండా వారు రూపొందించిన ప్లాన్‌నే ప్రజలపై రుద్ది ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత వచ్చిన కమిషనర్‌ వెంకటరమణారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని కొంతవరకు పరిష్కరించారు. ఆయన తిరుపతి కలెక్టర్‌గా వెళ్లిపోయారు. ఆరు నెలల క్రితం ఇన్‌చార్జి కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌ మల్లికార్జున కూడా వీఎంఆర్‌డీఏ వ్యవహారాలను రహస్యంగానే నడిపిస్తున్నారు. అధికార పార్టీ పెద్దలు చెప్పిన పనులు పూర్తిచేస్తున్నారు. సమీక్షలు నిర్వహిస్తున్నా వాటి సమాచారం బయటకు పొక్కనియ్యడం లేదు. పైగా మీడియాకు సమాచారం ఎవరు ఇచ్చినా వారిపై చర్యలు చేపడతామని అధికారులు, సిబ్బందిని హెచ్చరిస్తున్నారు.


పది ప్రాజెక్టులకు ఒకేసారి ప్రకటన

పర్యాటక అభివృద్ధికి హెలీ టూరిజం, స్కైటవర్‌, రివాల్వింగ్‌ రెస్టారెంట్‌, జిప్‌లైనర్‌ ఏర్పాటు వంటి అనేక ప్రతిపాదనలు వీఎంఆర్‌డీఏ చేసింది. ఏవీ పట్టాలు ఎక్కలేదు. తాజాగా ఏకంగా పది ప్రాజెక్టులను పీపీపీ విధానంలో బయట వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రకటన విడుదల చేసింది. డైనోసార్‌ మ్యూజియం, థీమ్‌ పార్క్‌, వాటర్‌ వరల్డ్‌, వ్యాక్స్‌ మ్యూజియం, బబుల్‌ టెంట్స్‌, గ్లాస్‌ స్కై వాక్‌, ఓపెన్‌ బస్‌ సిటీ టూరిజం, యాంఫీ థియేటర్‌, రివాల్వింగ్‌ రెస్టారెంట్‌, హాట్‌ ఎయిర్‌ బెలూన్లు వంటివి అందులో ఉన్నాయి. ఇవేవీ జాయింట్‌ వెంచర్‌గా చేయకూడదని, కేవలం పీపీపీలోనే చేయాలని, నిర్మాణ, నిర్వహణ బాధ్యతలు కూడా ఏజెన్సీయే చూసుకోవాలని ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రాజెక్టులు చేపట్టడానికి ముందుకు వచ్చే ఏజెన్సీలకు కేవలం ఏడాది అనుభవం, ఏడాదికి కోటి రూపాయల టర్నోవర్‌ వుంటే చాలని ప్రకటించింది. ఈ ప్రకటన తీరు చూస్తుంటే...పీపీపీ పేరుతో కీలకమైన భూములను అధికార పార్టీ నేతలకు అప్పగించి ‘పర్యాటకం’ బోర్డు తగించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. విశాఖపట్నంలో స్కూబా డైవింగ్‌, కయాకింగ్‌ వంటివి అనేక సంవత్సరాలుగా చేస్తున్న ప్రొఫెషన్లకే పర్యాటక శాఖ అనుమతులు ఇవ్వడం లేదు. అలాంటిది కేవలం ఏడాది అనుభవానికే కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చేస్తామని అధికారులు ఆసక్తి వ్యక్తీకరణతో ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే భీమిలి బీచ్‌ మార్గంలో పర్యాటక అభివృద్ధికి దోహదపడుతున్న వాటిని రాయలసీమ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇప్పుడు వీఎంఆర్‌డీఏ నుంచి అధికారికంగా పర్యాటక ప్రాజెక్టులు కొట్టేయడానికి ప్రణాళిక రూపొందించారనే ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2022-10-07T06:09:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising