ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్టు

ABN, First Publish Date - 2022-06-28T06:32:26+05:30

పెందుర్తి కూడలిలో కారులో కేరళకు గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, సిబ్బంది పట్టుకున్నారు.

పట్టుకున్న కారు, గంజాయితో సెబ్‌ అధికారులు, సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేపగుంట జూన్‌ 27: పెందుర్తి కూడలిలో కారులో కేరళకు గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు, సిబ్బంది పట్టుకున్నారు. 45 కిలోల గంజాయి, గంజాయి, రెండు లీటర్ల లిక్విడ్‌ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీటి ఖరీదు అంతరాష్ట్ర మార్క్‌ట్‌లో రూ.22 లక్షలు వుంటుందని అధికారులు తెలిపారు. ముందుగా అందిన సమాచారం మేరకు సెబ్‌ సూపరింటెండెంట్‌ బి.శ్రీనాఽథుడు పర్యదేక్షణలో సోమవారం వేకువజామున సీఐ సరోజని, సిబ్బంది గంజాయితో సహా నిందితులను పట్టుకున్నారు. వారిని విచారించగా కేరళకు చెందిన అబ్దుల్లా, మహ్మద్‌షాహిద్‌, విక్కీ నిజామ్‌ ముఠాగా ఏర్పడి గంజాయిని అరకు నుంచి కేరళకు రవాణా చేస్తున్నారు. వీరికి అరకులో వుంటున్న కృష్ణారావు అనే సహకరిస్తున్నట్టు సమాచారం. కాగా కారులో వున్న అబ్దుల్లా, కృష్ణారావు, మహ్మద్‌ షాహిద్‌లను అరెస్ట్‌ చేశారు. ప్రధాన నాయకుడైన విక్కీ నిజామ్‌ కేరళల్లో వున్నట్టు తెలిసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సెబ్‌ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సెబ్‌ పోలీసుల పనితీరును సీపీ శ్రీకాంత్‌ అభినందించారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ శ్రీనివాస్‌, హరి, అశోక్‌, నాయుడు, శివ, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-28T06:32:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising