ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

18 ఏళ్లు దాటిన వారు బూస్టర్‌ డోస్‌ వేసుకోవాలి

ABN, First Publish Date - 2022-08-12T05:18:45+05:30

రోనా బూస్టర్‌ డోస్‌ను 18 ఏళ్లు దాటిన వారందరూ వేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎ.హేమంత్‌ కోరారు.

వడ్డాది పీహెచ్‌సీలో రికార్డులు తనిఖీ చేస్తున్న డీఎంహెచ్‌ఓ హేమంత్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి హేమంత్‌

బుచ్చెయ్యపేట, ఆగస్టు 12: కరోనా బూస్టర్‌ డోస్‌ను 18 ఏళ్లు దాటిన వారందరూ వేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎ.హేమంత్‌ కోరారు. గురువారం ఆయన వడ్డాది, బుచ్చెయ్యపేట పీహెచ్‌సీలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు. పీహెచ్‌సీతోపాటు పరిసరాలను పరిశీలించారు. వడ్డాది పీహెచ్‌సీ నిర్ధేశించిన డెలివరీ లక్ష్యాలను పూర్తి చేయలేకపోవడంపై డాక్టరు మౌనికను ప్రశ్నించారు. నాడు-నేడు పథకంలో పీహెచ్‌సీ అభివృద్ధి పనులు సంవత్సరాల కాలంగా కొనసాగుతుండడంతో డెలీవరి కేసులు లక్ష్యాలను చేరుకోలేకపోతున్నామని మౌనిక తెలిపారు. సమస్యను అధిగమించి డెలీవరి సంఖ్యను పెంచాలని డాక్టరు మౌనికను ఆదేశించారు. పీహెచ్‌సీల్లో బూస్టర్‌ డోస్‌ వాక్సిన్‌ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సచివాలయాల్లో ప్రతి సోమ, శుక్రవారాలో బూస్టర్‌ డోస్‌ వ్యాక్సిన్‌ వేస్తారన్నారు. వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారందరూ బూస్టర్‌ డోస్‌ తప్పనిసరిగా వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బుచ్చెయ్యపేట పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టరు వెంకట సాయి, సీహెచ్‌ఓ దేముడు, ఫార్మసిస్టు చంద్రమౌళీ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-12T05:18:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising