ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ గర్జనకు ప్రజా మద్దతు లేదు

ABN, First Publish Date - 2022-10-17T07:02:57+05:30

విశాఖ గర్జనకు ప్రజా మద్దతు లేదని తేలిపోయిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న పల్లా శ్రీనివాసరావు, ఇతర నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

మహారాణిపేట, అక్టోబరు 16: విశాఖ గర్జనకు ప్రజా మద్దతు లేదని తేలిపోయిందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం టీడీపీ కార్యాలయంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే ప్రాతీయ విద్వేషాలను రెచ్చగొట్టి మూడు రాజధానులను తెరపైకి తెచ్చారని అన్నారు. గత మూడు సంవత్సరాలుగా ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయకుండా వైసీపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని ఆరోపించారు. ఏయూ ఉప కులపతి, కొంతమంది ప్రొఫెసర్లు వైసీపీ తాబేదారులుగా మారారని, నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థులను రెచ్చగొడుతూ ర్యాలీలో పాల్గొనేలా చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ విషయంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. జీవీఎంసీ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌లు కూడా వైసీపీకి అనుకూలంగా మారి గర్జనలో పాల్గొనేలా  యంత్రాంగాన్ని వినియోగించారని పల్లా శ్రీనివాసరావు వివరించారు. పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నప్పటికీ విశాఖ గర్జన విజయవంతం చేయలేకపోయారని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే సమస్యలపై నీతి, నిజాయితీగా పోరాటం చేయాలని కోరారు ఈ సమావేశంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, నియోజకవర్గం ఇన్‌చార్ఝిలు కోరాడ రాజబాబు, సీహెచ్‌. విజయబాబు, గండి బాబ్జి, చిన్నికుమారి లక్ష్మి, బైరెడ్డి పోతనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-17T07:02:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising