ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాడు-నేడు పనులు వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2022-09-10T06:26:33+05:30

మండలంలో నాడు-నేడు పథకంలో చేపట్టిన భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ఆదేశించారు.

తహసీల్దార్‌ అంబేడ్కర్‌ను వివరాలు అడుగుతున్న కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి 

బుచ్చెయ్యపేట, సెప్టెంబరు 9: మండలంలో నాడు-నేడు పథకంలో చేపట్టిన భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ఆదేశించారు. శుక్రవారం ఆయన తురకలపూడిలో రూ.2.02 కోట్లతో జరుగుతున్న జడ్పీ హైస్కూల్‌లో మెయింటెన్స్‌, పీహెచ్‌సీ అదనపు భవనం, సచివాలయం భవన నిర్మాణ పనులను పరిశీలించారు. హైస్కూల్‌లో విద్యాబోధన, ఎండీఎం భోజనం నాణ్యత, తదితర విషయాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. మూడు, నాలుగు నెలల్లో పనులు పూర్తి చేస్తామని ఇంజనీరింగ్‌ అధికారులు కలెక్టర్‌కు హామీ ఇచ్చారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తిచేయాలని, పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి హెచ్చరించారు. శశ్మానంలో నీటి ఎద్దడి పరిస్థితుల వలన దహన సంస్కారాలకు స్థానికులు ఇబ్బందులు పడుతున్నందున, చేతి బోరు మంజూరు చేయాలని మాజీ వైస్‌ ఎంపీపీ కోరుకొండ అప్పలనాయుడు కలెక్టర్‌ను కోరగా, 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేయాలని ఎంపీడీఓ సువర్ణరాజును కలెక్టర్‌ ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎస్వీ.అంబేడ్కర్‌, ఎంపీడీఓ సువర్ణరాజు, డీఈఈ మోహన్‌, శ్రీనివాస్‌ ప్రభు, గోపీనాథ్‌, ఏపీఓ మురళీ, హెచ్‌ఎం బాబురావు, తురకలపూడి పీహెచ్‌సీ డాక్టర్‌ సంధ్యారాణి పాల్గొన్నారు.  

Updated Date - 2022-09-10T06:26:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising