ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జలపాతం రోడ్డు బురదమయం

ABN, First Publish Date - 2022-10-17T06:23:00+05:30

మండలంలోని యర్రవరం జలపాతం రహదారి అధ్వానంగా తయారైంది. దీంతో ఈ మార్గంపై రాకపోకలు సాగించేందుకు స్థాని కులు, పర్యాటకులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

వర్షాలకు బురదగా మారిన యర్రవరం జలపాతం రహదారి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యర్రవరం వెళ్లాలంటే కష్టాలు

పర్యాటకులకు తప్పని ఇబ్బందులు


చింతపల్లి, అక్టోబరు 16: మండలంలోని యర్రవరం జలపాతం రహదారి అధ్వానంగా తయారైంది. దీంతో ఈ మార్గంపై రాకపోకలు సాగించేందుకు స్థాని కులు, పర్యాటకులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. యర్రవరం జలపాతానికి ఆనుకుని సుమారు పది గిరిజన గ్రామాలున్నాయి. జలపాతానికి వెళ్లే పర్యాటకులు, ఆ ప్రాంత ఆదివాసీలు ఈ మార్గం గుండానే రాకపోకలు సాగిస్తుంటారు. గతంలో చిన్నపాటి మట్టిరోడ్డు మాత్రమే అందుబాటులో ఉండేది. దీంతో నాలుగు చక్రాల వాహనాలు ఈ మార్గంలో ప్రయాణించే అవకాశం ఉండేది కాదు. స్థానికులు, పర్యాటకులు ద్విచక్ర వాహనాల్లో, కాలినడకన రాకపోకలు సాగించేవారు. తాజాగా ఈ మార్గానికి మిషన్‌ కనెక్టు పాడేరులో భాగంగా గ్రావెల్‌ రోడ్డు మంజూరైంది. దీంతో నిర్మాణ బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్‌ రహదారికి ఇరువైపులా కాలువలు తీసి, ఎర్ర మట్టి వేశారు. అయితే జీఎస్‌టీ(వెట్‌మిక్స్‌) వేయలేదు. దీంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రహదారి బురదమయమైంది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనాలు బురదలో చిక్కుకుపోతున్నాయి. పాద చారులు నడవడానికి అవకాశం లేకుండా ఉంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి రహదారిపై జీఎస్‌టీ(వెట్‌మిక్స్‌)వేయాలని ఈ ప్రాంతవాసులు, పర్యాటకులు కోరుతున్నారు.


Updated Date - 2022-10-17T06:23:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising