ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపమాక ఆలయంపై చిన్నచూపు తగదు

ABN, First Publish Date - 2022-12-15T01:14:12+05:30

మండలంలోని ఉపమాక వేంకటేశ్వరస్వామి దేవస్థానంపై టీటీడీ చిన్నచూపు చూస్తోందని, భక్తులకు అవసరమైన సదుపాయాలను సమకూర్చడం లేదంటూ నక్కపల్లి, ఉపమాక గ్రామాలకు చెందిన పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు.

దేవస్థానం అధికారికి వినతి పత్రం అందజేస్తున్న గ్రామ పెద్దలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నక్కపల్లి, డిసెంబరు 14 : మండలంలోని ఉపమాక వేంకటేశ్వరస్వామి దేవస్థానంపై టీటీడీ చిన్నచూపు చూస్తోందని, భక్తులకు అవసరమైన సదుపాయాలను సమకూర్చడం లేదంటూ నక్కపల్లి, ఉపమాక గ్రామాలకు చెందిన పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఆలయానికి వచ్చిన టీటీడీ డిప్యూటీ ఈవో వెంకటయ్యను కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా స్వామివారి పుష్కరిణి అత్యంత అధ్వానంగా ఉందని, ఆలయానికి వచ్చే మహిళా భక్తులకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. తక్షణమే ఆలయంలో సౌకర్యాలను మెరుగుపర్చి, సమస్యలు పరిష్కరించాలని కోరారు. అలాగే, ఆలయ ఆవరణలో కల్యాణ మండపం నిర్మించాలని లేనిపక్షంలో అనువైన స్థలాన్ని టీటీడీ కేటాయిస్తే విశాఖ డెయిరీ నిధులతో సువిశాలమైన కల్యాణ మండపాన్ని నిర్మించేందుకు ఆడారి ఆనంద్‌ అంగీకారం తెలిపారని వివరించారు. అనంతరం డిప్యూటీ ఈవో పుష్కరిణిని పరిశీలించి, సమస్యలను టీటీడీ ఈవో దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ, ఆలయ మాజీ చైర్మన్‌ కొప్పిశెట్టి కొండబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేష్‌, ఉపమాక ఉప సర్పంచ్‌ ప్రగడ వీరబాబు, కొప్పిశెట్టి హరిబాబు, జగదీశ్వరరావు, దేశెట్టి గంగా నాగేశ్వరరావు, తోలేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T01:14:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising