ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా శ్రీరాముడి తీర్థం

ABN, First Publish Date - 2022-01-17T06:22:17+05:30

వాడచీపురుపల్లి, భరణికం, రావాడ పంచాయతీ పరిధి ధర్మారాయుడుపేట గ్రామాల్లో ఆదివారం శ్రీరాముడు తీర్థం వైభవంగా జరిగింది.

తీర్థంలో చిటికెల భజనలు చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పరవాడ, జనవరి 16: వాడచీపురుపల్లి, భరణికం, రావాడ పంచాయతీ పరిధి ధర్మారాయుడుపేట గ్రామాల్లో ఆదివారం శ్రీరాముడు తీర్థం వైభవంగా జరిగింది. ఆయా గ్రామాల్లోని రామాలయాల వద్ద ప్రజలు శ్రీరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు, మాజీ సర్పంచ్‌లు శివలంక లక్ష్మి, పెదిశెట్టి పూజాశేఖర్‌, మోటూరి సన్యాసినాయుడు తదితరులు శ్రీరాముడ్ని దర్శించుకుని పూజలు చేశారు. తీర్థంలో ఏర్పాటు చేసిన సాముగరిడీలు, కోలాటాలు, చిడతలు, చిటికెల భజనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. అలాగే పంచదార చిలకల విక్రయాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పరిసర ప్రాంతాల ప్రజలతో తీర్థాలు కిక్కిరిశాయి. తీర్థం సందర్భంగా రామాలయాలను విద్యుత్‌ దీపాలంకరణతో తీర్చిదిద్దారు. భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు  కోన రామారావు, కూండ్రపు శ్రీనివాసరావు, బొండా సన్నిదేముడు, రమణమూర్తి, కూండ్రపు అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే రాత్రి 9 గంటల నుంచి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఘనంగా ఏడు అమ్మవార్ల పరస 

మల్కాపురం: ప్రకాశనగర్‌ ఏడుగుళ్ల జంక్షన్‌లో ఏడు అమ్మవార్ల పరస ఆదివారం ఘనంగా జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పీఎంసీ క్లబ్‌ ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు. 

Updated Date - 2022-01-17T06:22:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising