ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హరేకృష్ణ మూవ్‌మెంట్‌ సేవలు అభినందనీయం

ABN, First Publish Date - 2022-08-19T06:44:14+05:30

హరేకృష్ణ మూవ్‌మెంట్‌ సమాజ సేవ, భక్తిభావం భేష్‌గా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కితాబిచ్చారు.

రాధాకృష్ణులను దర్శించుకుంటున్న మంత్రి అమర్‌నాథ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన మంత్రి అమర్‌నాథ్‌

ఎంవీపీ కాలనీ, ఆగస్టు 18: హరేకృష్ణ మూవ్‌మెంట్‌ సమాజ సేవ, భక్తిభావం భేష్‌గా ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ కితాబిచ్చారు. శ్రీకృష్ణ జన్మాష్టమి-2022 వేడుకలు ఎంవీపీ కాలనీలోని గాదిరాజు ప్యాలెస్‌లో గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రి అమర్‌నాథ్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ పదేళ్లుగా హరేకృష్ణ మూవ్‌మెంట్‌ సామాజిక సేవా కార్యక్రమాలను కొనియాడారు.


ఈ సందర్బంగా మంత్రి అమర్‌నాథ్‌  బాలగోపాలునికి ఉయ్యాలసేవ నిర్వహించారు. హరేకృష్ణ మూవ్‌మెంట్‌ వ్యవస్థాపక గురువు భక్తి వేదాంత ప్రభు పాదుల చిత్రపటానికి పూలమాలలువేసి శ్రీరాధకృష్ణుల సన్నిఽధిలో హారతి స్వీకరించారు. భక్తులు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొని స్వామివారికి హరినామ జపమండపం, దర్శనం, బాలగోపాలునికి ఉయ్యాలసేవ చేశారు. ఈ సందర్బంగా సాంస్కృతి కార్యక్రమలు నిర్వహించారు. అలాగే, రాత్రి ఏడు గంటల సమయంలో పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో హరేకృష్ణ మూవ్‌మెంట్‌ అధ్యక్షులు డాక్టర్‌ నిష్ర్కించిన భక్తదాస తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-19T06:44:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising