ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడేళ్లుగా సబ్‌ పోస్టు మాస్టర్‌ పోస్టు ఖాళీ

ABN, First Publish Date - 2022-10-07T06:07:14+05:30

స్థానిక సబ్‌ పోస్టాఫీసులోని సబ్‌ పోస్ట్‌ మాస్టర్‌ పోస్టు(ఎస్‌పీఎం) మూడేళ్లుగా భర్తీ కాకుండా ఖాళీగా ఉంది.

పెదబయలులోని సబ్‌ పోస్టాఫీసు కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెదబయలు, అక్టోబరు 6: స్థానిక సబ్‌ పోస్టాఫీసులోని సబ్‌ పోస్ట్‌ మాస్టర్‌ పోస్టు(ఎస్‌పీఎం) మూడేళ్లుగా భర్తీ కాకుండా ఖాళీగా ఉంది. దీంతో దీని పరిధిలో ఉన్న పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లోని 34 బ్రాంచి పోస్టాఫీసుల పరిధిలో మెరుగైన పోస్టల్‌ సేవలు అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ సబ్‌ పోస్ట్‌ మాస్టర్‌గా పని చేసిన సురేశ్‌ అనే అధికారిని మూడేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాకు బదిలీ చేశారు. అప్పటి నుంచి ఆ పోస్టును భర్తీ చేయకుండా ఇన్‌చార్జి, డిప్యూటేషన్‌లతోనే కాలక్షేపం చేస్తున్నారు. అయితే రెండు మండలాలకు చెందిన పోస్టల్‌ శాఖలో కీలకమైన సబ్‌పోస్టు మాస్టర్‌ శాశ్వత అధికారి కాకపోవడంతో ఈ పరిధిలో ఉన్న సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తు న్నారు. ముఖ్యంగా రిజిస్టర్‌ పోస్టులు, ఇతర పోస్టల్‌ సేవల విషయంలో సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయి. వాస్తవానికి ఇక్కడ సబ్‌ పోస్టు మాస్టర్‌ బదిలీ అయిన రెండు లేదా మూడు నెలల్లోనే ఆ పోస్టు భర్తీ చేయాల్సి ఉండగా, పోస్టల్‌ అధికారి ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో ఏళ్ల తరబడి సబ్‌ పోస్ట్‌ మాస్టర్‌ పోస్టు ఖాళీగా ఉండిపోయింది. ఇదే అదనుగా సిబ్బంది తూతూమంత్రంగా విధులు నిర్వహిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా పోస్టల్‌ శాఖ ఉన్నతాధికారులు స్పందించి స్థానిక సబ్‌ పోస్టాఫీసులో ఖాళీగా ఉన్న సబ్‌పోస్టుమాస్టర్‌ పోస్టును భర్తీ చేయాలని స్థానికులు కోరుతున్నారు. 

Updated Date - 2022-10-07T06:07:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising