ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు మార్పు సిగ్గుచేటు

ABN, First Publish Date - 2022-09-30T07:05:13+05:30

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు కొన సాగించాలని డిమాండ్‌ చేస్తూ గురు వారం ఇక్కడి ఎన్టీఆర్‌ జంక్షన్‌ వద్ద టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

ఎన్టీఆర్‌ జంక్షన్‌లో ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  వైసీపీ ప్రభుత్వ తీరును ఖండించిన టీడీపీ శ్రేణులు 

 సబ్బవరంలో పెద్ద ఎత్తున ఆందోళన 

 సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నం

సబ్బవరం, సెప్టెంబరు 29 : ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు కొన సాగించాలని డిమాండ్‌ చేస్తూ గురు వారం ఇక్కడి ఎన్టీఆర్‌ జంక్షన్‌ వద్ద టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్ర హానికి పాలాభిషేకం చేసి, ముఖ్యమంత్రి జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హెల్త్‌ వర్సిటీకి వైఎస్సార్‌ పేరు నిర్ణయాన్ని ఖండించారు.  ఈ సంద ర్భంగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహ నం చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. అనంత రం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బండారు అప్పల నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు మార్చడానికి వైసీపీ ప్రభు త్వానికి సిగ్గు ఉండాలన్నారు. ఎవరైనా కొత్తగా నిర్మించిన వాటికి పేర్లు పెడతారని, కానీ ఈ ముఖ్యమంత్రి  మాత్రం ఎవరో కట్టిన వాటికి తమ తండ్రి పేరు పెడతామనడం విడ్డూరుంగా ఉంద న్నారు.  ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎం.మహాలక్ష్మినాయుడు, భర్నికాన బాబూరావు,  పీబీవీఎస్‌ఎన్‌ రాజు, గండి దేముడు, కొటాన అప్పారావు, పల్ల తాతారావు, రేసుపూడి రమణ, ఈపు అప్పలరాజులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు  పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-30T07:05:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising