ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేటకు వెళ్లిన యువకుడి మృతి మిస్టరీ వీడింది

ABN, First Publish Date - 2022-01-24T06:31:24+05:30

వన్యప్రాణుల వేటకు వెళ్లిన యువకుడు వ్యవసాయ బావిలో శవమై కనిపించిన కేసు మిస్టరీని కోటవురట్ల పోలీసులు ఛేదించారు.

విలేఖర్ల సమావేశంలో నిందితులను చూపుతున్న సీఐ శ్రీనివాసరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులు 

 ముగ్గురి అరెస్టు 

 వివరాలు వెల్లడించిన రూరల్‌ సీఐ

కోటవురట్ల, జనవరి 23 : వన్యప్రాణుల వేటకు వెళ్లిన యువకుడు వ్యవసాయ బావిలో శవమై కనిపించిన కేసు మిస్టరీని కోటవురట్ల పోలీసులు ఛేదించారు. ఇందుకు సంబంధించి నర్సీపట్నం రూరల్‌ సీఐ శ్రీనివాసరావు ఆదివారం సాయంత్ర విలేఖర్లకు తెలి పిన వివరాలివి.  కోటవురట్ల మండలం పందూరు గ్రామానికి చెందిన మల్లవరపు నవీన్‌ (19), కాండ్రకోట సత్తిబాబు, రాజు  కలిసి నాటు తుపాకీతో ఈ నెల 6వ తేదీ రాత్రి గాదుల కొం డకు వన్యప్రాణుల వేటకు వెళ్లారు. అలా వెళ్లిన వీరిలో తెల్లవారుజామున నవీన్‌ కనింపిచడం లేదని కుటుంబ సభ్యులకు  సత్తిబాబు, రాజు సమాచారం అందించారు. ఎంత గాలించినా ఫలితం లేకపోవడంతో  నవీన్‌ సోదరుడు దుర్గాప్రసాద్‌ ఈనెల 9న కోటవురట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతలోనే ఆ మర్నాడు ఓ వ్యవసాయ బావిలో నవీన్‌ మృతదేహం బయటపడిన విషయం తెలిసిందే. 

ఇదిలావుంటే, ఆరో తేదీన ఇదే మం డలం కైలాసపట్నానికి చెందిన వంతర కల్యాణ్‌, చిటికెల నూకరాజులు పందూరు గ్రామానికి చెందిన ఏలేశ్వరం ఈశ్వరరావుతో పందూరు గాదులకొండ ప్రాంతంలో అడవి జంతుల వేట కోసం ఇనుప తీగలను కరెంటు వైర్లకు కనెక్షన్‌ కలిపి దూరంగా వెళ్లిపోయినట్టు సీఐ చెప్పారు. అదే సమయంలో  నవీన్‌,  సత్తిబాబు, రాజు ముగ్గురూ నాటు తుపాకీతో వన్యప్రాణుల వేటకు వెళా ్లరని సీఐ చెప్పారు. వీరిలో నవీన్‌ తుపాకీ పట్టుకుని కొండ మీదకు వెళ్లగా, ఇంతలో పందుల కోసం అమర్చిన తీగ అతని కాలుకు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందినట్టు  వివరిం చారు. మిగిలిన వారు ఏదో జంతువు పడి ఉంటుందని ఆశగా దగ్గరకు వెళ్లి చూడగా, నవీన్‌ మృతదేహం కనిపిం చింది. దీంతో ఈ విషయం బయట పడితే పోలీసు కేసు అవుతుందని భయ పడి బండరాయికి నవీన్‌ మెడ, భుజనానికి కలిపి బలంగా ఇనుప తీగ చుట్టి దగ్గరలో గల వ్యవసాయ బావిలో పడే శారని సీఐ చెప్పారు. దీనిపై వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపి కేసును ఛేదిం చామన్నారు. ఈ ఘటనలో వంతర కల్యాణ్‌,  చిటికెల నూకరాజు, ఏలేశ్వరం ఈశ్వరరావులను అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు.

Updated Date - 2022-01-24T06:31:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising