ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Severe cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం

ABN, First Publish Date - 2022-12-07T03:18:18+05:30

దక్షిణ అండమాన్‌లో ఉన్న అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించి మంగళవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా, సాయంత్రానికి వాయుగుండంగా మారింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రేపటి నుంచి భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం

నేటి సాయంత్రానికి తుఫాన్‌గా మారే అవకాశం

9వ తేదీ రాత్రి లేదా 10 తెల్లవారుజామున చెన్నైకు దక్షిణాన తీరం దాటుతుందని అంచనా

9,10 తేదీల్లో ఏపీలో విస్తారంగా వర్షాలు

వరి రైతుల్లో తీవ్ర ఆందోళన

విశాఖపట్నం, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): దక్షిణ అండమాన్‌లో ఉన్న అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించి మంగళవారం ఉదయానికి తీవ్ర అల్పపీడనంగా, సాయంత్రానికి వాయుగుండంగా మారింది. ఇది శ్రీలంకలోని ట్రింకోమలై తూర్పు ఆగ్నేయంగా 770 కిలోమీటర్లు.. చెన్నైకు 1020 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది. ఇది బుధవారం ఉదయం తీవ్రవాయుగుండగా.. సాయంత్రానికి తుఫానుగా మారుతుంది. ఈ క్రమంలో పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించి ఈ నెల ఎనిమిదో తేదీ ఉదయానికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాల్లో తీరం దిశగా రానున్నది. తరువాత కూడా పశ్చిమ వాయువ్యంగానే పయనిస్తూ ఈనెల తొమ్మిదో తేదీ రాత్రి లేదా పదో తేదీ తెల్లవారుజామున ఉత్తర తమిళనాడులో చెన్నైకు దక్షిణాన తీరం దాటుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు అంచనా వేశారు. కాగా, ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం బుధవారం దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, ఉత్తరకోస్తాలో పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఈ నెల ఎనిమిదో తేదీన దక్షిణ కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని తెలిపింది. తుఫాన్‌ తీరం దిశగా వచ్చే క్రమంలో ఈ నెల తొమ్మిదో తేదీన దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక ప్రాంతాలు, ఉత్తర కోస్తాలో పలు ప్రాంతాల్లో సాధారణ వర్షాలు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీనుంచి అతిభారీ, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయి. పదో తేదీన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీనుంచి అతిభారీ, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్‌, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కడప, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా తీరంలో ఈనెల ఎనిమిదో తేదీ నుంచి పదో తేదీ వరకు గంటకు 50 నుంచి 60, అప్పుడప్పుడు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారు తిరిగి వచ్చేయాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అంబేడ్కర్‌ సూచించారు.

రైతులు అప్రమత్తం కావాలి!

తుఫాను హెచ్చరికతో కోస్తాలో ప్రధానంగా బాపట్ల నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ముమ్మరంగా వరి కోతలు సాగుతున్నాయి. పనలన్నీ పొలాల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా తుఫాన్‌ తీరం దాటే సమయం (ఈనెల తొమ్మిది, పది తేదీల మధ్య) లో నెల్లూరు నుంచి గోదావరి జిల్లాల వరకూ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం వరి కోతలు నిలిపివేయాలని, పొలాల్లో ఓదెలు కుప్పలుగా పెట్టి వాటిపై టార్పాలిన్లు కప్పుకోవాలని సూచిస్తున్నారు.

Updated Date - 2022-12-07T08:42:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising