ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాపులకు అత్యధిక అసెంబ్లీ సీట్లు కేటాయించాలి

ABN, First Publish Date - 2022-06-28T06:35:41+05:30

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో కాపులకు అత్యధిక సీట్లు కేటాయించాలని కాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏవీ రమణయ్య డిమాండ్‌ చేశారు

సంఘీభావం తెలుపుతున్న కాపు సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏవీ రమణయ్య

మహారాణిపేట, జూన్‌ 27: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లాలో కాపులకు అత్యధిక సీట్లు కేటాయించాలని కాపు సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏవీ రమణయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం దసపల్లా హోటల్‌లో కాపు సంఘం ముఖ్య నేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ తాము ఏ పార్టీని విమర్శించబోమని, జనాభా ప్రాతిపదికన కాపులకు రాజకీయ ప్రాధాన్యం కల్పించాలని కోరారు.  కేవలం ఐదు, పది శాతం ఓటు బ్యాంక్‌  కలిగిన వారికే అసెంబ్లీ సీట్లు కేటాయించటం సరికాదని వివరించారు.  బీమిలి, పెందుర్తి, గాజువాక, ఉత్తరం తదితర నియోజకవర్గాలలో 40 శాతంకు పైగా కాపులున్నారని తెలిపారు. అదేవిధంగా చోడవరం, అనకాపల్లి, మాడుగుల, ఎలమంచిలితోపాటు పలు నియోజకవర్గాలలో కాపులకు అధిక శాతం ఓటింగ్‌ ఉందన్నారు. ఈ సమావేశంలో సంఘం కార్యదర్శి బొండా అప్పారావు, గేదెల మురళీకృష్ణ, నారాయణరావు, మురిపిండి సన్యాసిరావు, శ్రీహరి కంపర వెంకటేశ్వరరావు, కొండబాబు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-28T06:35:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising