ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవలసిందే

ABN, First Publish Date - 2022-09-25T06:46:45+05:30

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ప్రతిఘటన తప్పదని టీడీపీ లీగల్‌ సెల్‌ నాయకులు తీవ్రంగా హెచ్చరించారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ లీగల్‌సెల్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


టీడీపీ లీగల్‌ సెల్‌ నాయకుల డిమాండ్‌

చోడవరం, సెప్టెంబరు 24: ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే ప్రతిఘటన తప్పదని టీడీపీ లీగల్‌ సెల్‌ నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో టీడీపీ లీగల్‌ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి గూనూరు లక్ష్మీనారాయణ, అనకాపల్లి పార్లమెంట్‌ లీగల్‌సెల్‌ అధ్యక్షులు కొల్లి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు. తెలుగుజాతికి వన్నె తెచ్చిన మహానుభావుడు ఎన్టీఆర్‌ పేరును మార్చాలని సీఎం జగన్‌ నిర్ణయించడం సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మార్పుచేయడం ఇదేం పద్ధతని వారు విమర్శించారు. ఎన్టీఆర్‌ పేరు మార్పుపై అన్నివర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నందున, ప్రభుత్వం  పేరుమార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సమావేశంలో టీడీపీ లీగల్‌ సెల్‌ నియోజకవర్గ నాయకులు నంబారు నరసింగరావు, బర్ల గణేష్‌, గొర్లె కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-25T06:46:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising