ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రమపద్ధతిలో భక్తుల నియంత్రణ లక్ష్యం

ABN, First Publish Date - 2022-07-06T06:22:05+05:30

సింహాచలేశుని వార్షిక ఉత్స వాల్లో ఒకటైన గిరిప్రదక్షిణకు ఈనెల 12న లక్షలాదిమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, రద్దీనెలకొనకుండా వారిని క్రమపద్ధతిలో నియం త్రించడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సుమిత్‌ సునీల్‌గార్గ్‌ తెలిపారు.

దేవస్థానం ఈవో, ఇతర అధికారులతో చర్చిస్తున్న డీసీపీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిసీపీ సుమిత్‌ సునీల్‌ గార్గ్‌

గిరిప్రదక్షిణ ఏర్పాట్లు పరిశీలన

సింహాచలం, జూలై 5: సింహాచలేశుని వార్షిక ఉత్స వాల్లో ఒకటైన గిరిప్రదక్షిణకు ఈనెల 12న లక్షలాదిమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, రద్దీనెలకొనకుండా వారిని క్రమపద్ధతిలో నియం త్రించడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పనిచేస్తుందని  డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సుమిత్‌ సునీల్‌గార్గ్‌ తెలిపారు. గిరి ప్రదక్షిణలో పోలీసులు అను సరించాల్సిన విధి విధానాలపై దేవస్థానం ఈవో ఎం.వి.సూర్యకళ, ఆర్టీసీ ఆర్‌ఎం తదితరులతో కలిసి మంగళవారం  ఆయన క్షేత్ర స్థాయి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వామి వారి పుష్పతేరు బయలుదేరే సమయంలో సింహాచలం ప్రధాన కూడలికి వేలాది మంది చేరుకుంటా రన్నారు. ఆ సమయంలో పోలీసులు జాగరూకతతో వ్యవహరించాలన్నారు.


తొలిపావంచావద్ద కొబ్బరి కాయలు కొట్టేందుకు ఎక్కువ క్యూలు ఏర్పాటు చేయడం, రథం వెంట క్రమపద్ధతిలో భక్తులు కదిలే చూడడడం చేయాలన్నారు. పోలీసులకు అన్ని విభాగాల అధికారులు సహకరించి సమన్వయంతో పనిచేయాలని కోరారు. యాత్ర ప్రారంభానికి వచ్చే బస్సులను పాత అడవి వరం కూడలి, గోశాల కూడలి వరకే అనుమతించాలని, వాటిని క్రమపద్ధతిలో పంపించి ట్రాఫిక్‌ జాం లేకుండా చూడా లన్నారు.


తాగునీరు, మరుగుదొడ్లు, వైద్యం, ఇతర సహాయాల విషయంలో దేవస్థానం అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వెళ్లేటప్పుటు భక్తులు మెట్లమార్గం, వచ్చేటప్పుడు బస్సులు వినియో గించుకునేలా చూడాలన్నారు. ఆయన వెంట ఏసీపీలు పెంటారావు, శరత్‌కుమార్‌రాజు, సీఐలు, దేవస్తానం ఈఈ డి.సి.శ్రీవాసరాజు,  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-06T06:22:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising