ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖను స్మార్ట్‌సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం

ABN, First Publish Date - 2022-10-12T06:32:23+05:30

విశాఖలో స్మార్ట్‌ సిటీ పనులను త్వరితగతిన పూర్తిచేసి నగర ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన జీవనాన్ని అందించే దిశాగా జీవీఎంసీ కృషి చేస్తుందని కమిషనర్‌, స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ సీఈఓ పి.రాజాబాబు తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు

విశాఖపట్నం, అక్టోబరు 11: విశాఖలో స్మార్ట్‌ సిటీ పనులను త్వరితగతిన పూర్తిచేసి నగర ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన జీవనాన్ని అందించే దిశాగా జీవీఎంసీ కృషి చేస్తుందని కమిషనర్‌, స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్‌ సీఈఓ పి.రాజాబాబు తెలిపారు. మంగళవారం ఏపీ అర్బన్‌ ఇన్‌ఫా్ట్రస్ట్రక్చర్‌ అండ్‌ అసెట్స్‌ మేనేజ్‌మెంట్‌ వారితో కలిసి జీవీఎంసీ కమిషనర్‌ స్మార్ట్‌ సిటీ అభివృద్ధి పనులపై స్మార్ట్‌ సిటీ అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. దీనిద్వారా స్మార్ట్‌ సిటీ పనులు ఏఏ దశలో ఉన్నాయో వివరించారు.


నగర ప్రాజెక్టు కింద 40 జీవీఎంసీ స్కూళ్లను నాడు-నేడు తరహాలో అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా సీవరేజ్‌ నెట్‌వర్క్‌ వ్యవస్థ పనులలో ప్యాకేజీ 1, 2 పనులు నిర్ణీత సమయంలో పూర్తయ్యేందుకు కావాల్సిన నిధులను జీవీఎంసీ, జీవీఎస్‌ సీసీఎల్‌ సంయుక్తంగా సమకూరుస్తుందన్నారు. అందుకు సంబంధించిన నిధులు, కావాల్సిన సహకారం స్మార్ట్‌ సిటీ అందిస్తుందని, రాబోయే ప్రతిపాదిత టెండర్లలో కూడా కాంట్రాక్టర్లు పాల్గొనేలా చూడాలని తెలిపారు.


నగర ప్రజలు నగరాభివృద్ధికి కావాల్సిన పనులకు సంబంధించి నూతన ప్రతిపాదనలతో ముందుకు వచ్చి జీవీఎంసీ, విశాఖ స్మార్ట్‌ సిటీకి సహకరించాలని స్మార్ట్‌ సిటీ సీఈఓ నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో  ఏపీయూఐఏఎంఎల్‌ సీఈఓ నారాయణ రెడ్డి, సీటీఓ శ్రీనివాస్‌, రీజనల్‌ హెడ్‌ సత్యనారాయణ, జీవీఎంసీ పర్యవేక్షక ఇంజినీరు వినయ్‌ కుమార్‌, స్మార్ట్‌ సిటీ మేనేజర్‌ ఆనంద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-12T06:32:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising