ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలి

ABN, First Publish Date - 2022-06-27T06:31:50+05:30

అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక, ఉద్యోగ సంఘాలు ముక్తంకఠంతో డిమాండ్‌ చేశాయి. ఇక్కడి కార్మిక కర్షక నిలయంలో ఆదివారం సదస్సు నిర్వహించారు.

సదస్సులో మాట్లాడుతున్న లోకనాథం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సదస్సులో విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక, ఉద్యోగ సంఘాల డిమాండ్‌

అనకాపల్లి టౌన్‌, జూన్‌ 26 : అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని విద్యార్థి, ఉపాధ్యాయ, కార్మిక, ఉద్యోగ సంఘాలు ముక్తంకఠంతో డిమాండ్‌ చేశాయి. ఇక్కడి కార్మిక కర్షక నిలయంలో ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం మాజీ నాయకుడు కె.లోకనాథం మాట్లాడుతూ దేశ రక్షణ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేసి, పాత విధానంలోనే రక్షణ రంగంలోని ఖాళీలను భర్తీ చేయాలన్నారు. కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి ఎ.బాలకృష్ణ మాట్లాడుతూ దేశ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు కారుచౌకగా కట్టబెట్టి బీజేపీ పాలకులు రక్షణకు సాయుధులైన ప్రైవేటు సైన్యాన్ని ఉపయోగించాలని కుట్రలు చేస్తున్నార న్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, వృత్తిసంఘాల జిల్లా నాయకులు గంటా శ్రీరామ్‌ మాట్లాడుతూ అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలని పట్టుబట్టారు. పి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో  మళ్ల సత్యనారాయణ, బి.ఉమామహేశ్వరరావు, కె.తేలయ్యబాబు, నూకఅప్పారావు  పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-27T06:31:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising