ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదిగో పులి.. ఇదిగో గాండ్రింపు!

ABN, First Publish Date - 2022-07-07T06:33:57+05:30

గత వారం రోజులుగా కోటవురట్ల, ఎలమంచిలి, కశింకోట మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి... తాజాగా రావికమతం మండలం గొల్లలపాలెం రిజర్వు ఫారెస్టులోకి వచ్చి ఉంటుందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు.

మర్రివలస గ్రామస్థులతో మాట్లాడుతున్న అటవీ శాఖ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రావికమతం మండలం గొల్లలపాలెం రిజర్వు ఫారెస్టులో సంచారం?

కొనసాగుతున్న అటవీ శాఖ గాలింపు

సమీప గ్రామాల్లో గస్తీ 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు

బుచ్చెయ్యపేట మండలం చినమల్లాంలో పులి గాండ్రింపులు?  


రావికమతం, జూలై 6: గత వారం రోజులుగా కోటవురట్ల, ఎలమంచిలి, కశింకోట మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి... తాజాగా రావికమతం మండలం గొల్లలపాలెం రిజర్వు ఫారెస్టులోకి వచ్చి ఉంటుందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. గత రెండు రోజుల నుంచి  గొల్లలపాలెం రిజర్వు ఫారెస్టును ఆనుకొని ఉన్న తట్టబంద, పొర్లుపాలెం, మర్రివలస, వమ్మవరం, బూరుగుపాలెం తదితర గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలనిదండోరా వేయిస్తున్నారు. రిజర్వు ఫారెస్టులోకి, సరుగుడు తోటలవైపు పశువులు, మేకలను మేతకు తోలుకెళ్ల వద్దని, రాత్రిపూట గ్రామ శివారుల్లోని పాకల్లో పశువులను ఉంచ వద్దని చెబుతున్నారు. 


చినమల్లాంలో పులి గాండ్రింపులు!

బుచ్చెయ్యపేట, జూలై 6: మండలంలోని మల్లాం శివారు చినమల్లాం రెవెన్యూ పరిధిలో బుధవారం మధ్యాహ్నం పెద్దపులి గాండ్రింపులు వినిపించినట్టు పలువురు చెబుతున్నారు.  దీంతో మల్లాం, చినమల్లాం, గోకాడపాలెం, చినభీమవరం, గంగాదేవిపేట గ్రామాలకు చెందిన రైతులు పొలాల నుంచి పరుగు పరుగున ఇళ్లకు చేరుకున్నారు. చినమల్లాం గ్రామానికి చెందిన గొలగాని తాతమ్మ తన జీడిమామిడి తోటలో పులి గాండ్రింపు వినిపించిందని సాటి రైతులు తెలిపారు. కాగా పెద్ద పులి కశింకోట మండలం తాళ్లపాలెం ప్రాంతం నుంచి బుచ్చెయ్యపేట మండలం పూలకొండకు చేరుకుందని, నల్లకొండ వైపు వెళుతున్నదన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నల్లకొండ ప్రాంతం మీదుగా పంగిడి ప్రాంతంలోకి వచ్చే అవకాశం వుందని అంటున్నారు. 


Updated Date - 2022-07-07T06:33:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising