ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్‌సీ ఉత్తర్వులు వెంటనే రద్దుచేయాలి

ABN, First Publish Date - 2022-01-19T06:28:02+05:30

అసంబద్ధమైన పీఆర్‌సీ ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఫ్యాప్టో రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు మంగళవారం స్థానిక గౌతమ్‌ సెంటర్‌లో ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు

నక్కపల్లిలో జీవో ప్రతులను దహనం చేస్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉపాధ్యాయులు డిమాండ్‌

జీవో ప్రతులు దహనం చేసి నిరసన


పాయకరావుపేట, జనవరి 18: అసంబద్ధమైన పీఆర్‌సీ ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఫ్యాప్టో రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు మంగళవారం స్థానిక గౌతమ్‌ సెంటర్‌లో ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, ఈనెల 20వ తేదీన కలెక్టరేట్‌ ముట్టడి నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం పీఆర్‌సీ ఉత్తర్వుల కాపీలను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు గణేశ్‌, రామ్‌రహీమ్‌, కిల్లాడ శ్రీనివాసరావు, ప్రసన్న కుమార్‌, శ్రీరామచంద్రమూర్తి, కృష్ణరాజు, ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు.


నక్కపల్లిలో....

నక్కపల్లి: మధ్యంతర భృతి(ఐఆర్‌) కన్నా పీఆర్‌సీలో ఫిట్‌మెంట్‌ తక్కువ ఇవ్వడం, హెచ్‌ఆర్‌ ఏలో భారీ కోతను నిరసిస్తూ నక్కపల్లిలో ఉపాధ్యా యులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ తీరుతో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో ప్రతులను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో నాయకులు దాడిశెట్టి కొండలరావు, చొక్కా అప్పలరాజు, కేఎస్‌ఎస్‌ సాయి ప్రసాద్‌, రాజేశ్‌, సురేశ్‌ కుమార్‌, రవి, సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-19T06:28:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising