ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్‌సీ జీవోలపై టీచర్ల ఆందోళన

ABN, First Publish Date - 2022-01-19T05:50:38+05:30

ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనం లేని పీఆర్‌సీ జీవోలను రద్దు చేయాలని, మెరుగైన ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ఫ్యాప్టో నేత ఎ.శ్యామ్‌సుందర్‌ డిమాండ్‌ చేశారు.

పాడేరులో పీఆర్‌సీ జీవో కాపీలను దహనం చేస్తున్న టీచర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పాడేరు, జనవరి 18: ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనం లేని పీఆర్‌సీ జీవోలను రద్దు చేయాలని, మెరుగైన ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని ఫ్యాప్టో నేత ఎ.శ్యామ్‌సుందర్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్‌సీ జీవోలకు వ్యతిరేకంగా మంగళవారం సాయంత్రం స్థానిక అంబేడ్కర్‌ కూడలి వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో టీచర్లు నిరసన చేపట్టారు. అందులో భాగంగా ప్రభుత్వం తాజాగా జారీ చేసిన పీఆర్‌సీ జీవో కాపీల ప్రతులను దహనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్‌సీ జీవోలపై ఉద్యోగులు సంతృప్తిగా లేరని, ఐఆర్‌ కంటే ఫిట్‌మెంట్‌ ఎక్కువగా ఇవ్వాలని, హెచ్‌ఆర్‌ఏలో కోత విధించవద్దని, ఉద్యోగుల జీతాలు పెరిగేలా పీఆర్‌సీ ఉండాలని శ్యామ్‌సుందర్‌ డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ నేతలు బట్టి చిన్నారావు, మొస్య సత్యారావు, ప్రభాకర్‌, పోతురాజు, కొండబాబు, సూర్యకుమారి, దొర, కూర్యారావు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శంకరరావు, ఏపీ ఎన్‌జీవో డివిజన్‌ కార్యదర్శి సంజీవరాజు, యూటీఎఫ్‌ నేత నాగేశ్వరరావు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-19T05:50:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising