ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో విధ్వంసంపై మహానాడులో చర్చ

ABN, First Publish Date - 2022-05-25T06:39:51+05:30

ఒంగోలులో ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడులో విశాఖ విధ్వంసంపై ప్రత్యేక చర్చ చేపట్టాలని జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ తీర్మానించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ తీర్మానం 

టిడ్కో ఇళ్లు, సింహాచలం భూ సమస్య, మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు, ఉక్కు కర్మాగారం, గంగవరం పోర్టులో వాటాల విక్రయంపై చర్చించాలని నిర్వహణ కమిటీకి ప్రతిపాదన


విశాఖపట్నం, మే 24 (ఆంధ్రజ్యోతి): ఒంగోలులో ఈ నెల 27, 28 తేదీల్లో జరగనున్న మహానాడులో విశాఖ విధ్వంసంపై ప్రత్యేక చర్చ చేపట్టాలని జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ తీర్మానించింది. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ కమిటీ పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళవారం సాయంత్రం పార్టీ కార్యాలయంలో కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పరిశీలకునిగా మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఇటీవల నిర్వహించిన మినీ మహానాడుల్లో చేసిన తీర్మానాలను ఈ సమావేశంలో చర్చించారు. పాలనా రాజధాని పేరుతో విశాఖ నగరాన్ని గడిచిన మూడేళ్లలో వైసీపీ నేతలు ఏ విధంగా విధ్వంసం చేశారో మహానాడులో చర్చించాలని ప్రతిపాదిస్తూ తీర్మానం చేశారు. విశాఖను పాలనా రాజధాని చేస్తామంటూ ఉత్తరాంధ్ర ప్రజలను వైసీపీ మోసం చేసిందని నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. రాజధాని పేరిట అభివృద్ధి చేయలేదు సరికదా...నగరాన్ని విధ్వంసం చేశారని, బెదిరించి భూములను దోచుకున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకుల భూములకు అనుకూలంగా వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌ రహదారులను మార్చడం, సింహాచలం భూ సమస్యను పరిష్కరించకపోవడం, జీవీఎంసీ నిధులు మళ్లింపు, టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించకపోవడం వంటి అంశాలను విశాఖ విధ్వంసం పేరిట చర్చలో పొందుపరుస్తూ తీర్మానించారు. ఈ తీర్మానాన్ని మహానాడు నిర్వహణ కమిటీకి పంపించాలని సమావేశం నిర్ణయించింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణలో ద్వంద్వ వైఖరి అవలంబించడం ద్వారా వైసీపీ కుట్ర బట్టబయలైందని, గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాను విక్రయించాలని నిర్ణయించడం వంటి అంశాలను మహానాడులో చర్చకు పెట్టాలని సమన్వయ కమిటీ తీర్మానించింది. విశాఖ నుంచి మహానాడుకు పెద్దఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లాలని సమావేశంలో నేతలు కోరారు. సమన్వయ కమిటీ సమావేశానికి మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ బుద్దా నాగజగదీష్‌, ఎమ్మెల్యే గణబాబు, మాజీ ఎమ్మెల్యేలు పప్పల చలపతిరావు, కోళ్ల లలితకుమారి, గండి బాబ్జీ, పీలా గోవింద్‌, గవిరెడ్డి రామానాయుడు, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజులతోపాటు నియోజకవర్గ ఇన్‌చార్జులు బత్తుల తాతయ్యబాబు, కోరాడ రాజబాబు, పీవీజీ కుమార్‌, ప్రగడ నాగేశ్వరరావు, నాయకులు నజీర్‌, పాశర్ల ప్రసాద్‌, పీలా శ్రీనివాసరావు, చిక్కాల విజయ్‌, దొరబాబు, లొడగల కృష్ణ, ఆరేటి మహేష్‌, గంటా నూకరాజు, పుచ్చా విజయ్‌కుమార్‌, రాజమండ్రి నారాయణ, కార్పొరేటర్లు హాజరయ్యారు.

Updated Date - 2022-05-25T06:39:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising