ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీసీలకు పథకాలు పునరుద్ధరించాలి

ABN, First Publish Date - 2022-12-07T00:35:50+05:30

గత ప్రభుత్వంలో బీసీలకు అమలు చేసిన పథకాలు పునరుద్ధరించాలని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, 25వ వార్డు కౌన్సిలర్‌ చింతకాయల రాజేశ్‌ డిమాండ్‌ చేశారు.

నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సీపట్నం, డిసెంబరు 6 : గత ప్రభుత్వంలో బీసీలకు అమలు చేసిన పథకాలు పునరుద్ధరించాలని తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు, 25వ వార్డు కౌన్సిలర్‌ చింతకాయల రాజేశ్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం తెలుగుదేశం ఆధ్వర్యంలో ఇక్కడ ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి దగ్గర నుంచి ఐదు రోడ్లు కూడలి, కృష్ణాబజార్‌, అబీద్‌ సెంటర్‌ మీదుగా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యాలయం ఏవో సూర్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల మీద దాడులు పెరిగిపోయాయన్నారు. రాష్ట్రంలో 26 మంది బీసీ నేతలను హత్య చేశారని ఆరోపించారు. అలాగే 650 బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. గత ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు రద్దు చేసి వైసీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందన్నారు. మూడున్నర ఏళ్లలో రూ.34వేల కోట్లు బీసీ సబ్‌ప్లాన్‌ నిధులు మళ్లించారని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో 10 శాతం రిజర్వేషన్‌ తగ్గించి 16,800 పదవులకు బీసీలను దూరం చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు సుకల రమణమ్మ, టీడీపీ మండల అధ్యక్షు లు నందిపల్లి వెంకటరమణ(నాతవరం) అడిగర్ల అప్పలనాయుడు(గొలుగొండ), లాలం శ్రీరంగస్వామి(నర్సీపట్నం), వార్డు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

చంద్రబాబుతోనే రాష్ట్ర పురోగతి సాధ్యం

రావికమతం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే తిరోగమనంలో పయనిస్తున్న రాష్ట్రం పురోగతి సాధించగలదని టీడీపీ చోడవరం నియోజకవర్గ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు అన్నారు. మంగళవారం రాత్రి దొండపూడిలో నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వ పాలనలో పెరిగిన నిత్యావసరాల ధరలు, ఆ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు రాజాన కొండనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు, టీడీపీ నాయుకులు వెదురుపర్తి వెంకటాచారి,కోప్పాక నాయుడు,పాతాళ ఐయిలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:35:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising