వచ్చే ఎన్నికల్లో వైసీపీని తరిమికొడదాం
ABN, First Publish Date - 2022-12-15T23:58:32+05:30
వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయ్యిందని, రాబోయే ఎన్నికల్లో ఓటుతో వైసీపీని తరిమికొడదామని మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు.
మాడుగుల రూరల్, డిసెంబరు 15 : వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలయ్యిందని, రాబోయే ఎన్నికల్లో ఓటుతో వైసీపీని తరిమికొడదామని మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అన్నారు. గురువారం ముకుందపురంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో ర్యాలీ నిర్వహిం చారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కీచక పాలన కొనసాగుతున్నదన్నారు. ఏవో కొర్రీలు వేస్తూ ప్రజలకు అందాల్సిన పథకాలు అందకుండా రద్దు చేస్తున్నారన్నారు. అన్యాయమని ప్రశ్నించిన వారిపై కక్ష కడుతున్నారన్నారు. ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత పెరిగిందని, టీడీపీకి ఆదరణ లభిస్తోందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు మజ్జి తాతబాబు, మాలిబాబు, సాంబమూర్తి, నాయుడు, నాగమణి పాల్గొన్నారు.
రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు సీఎం కావాలి : బత్తుల
రోలుగుంట: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బత్తుల తాతయ్యబాబు అన్నారు. గురువారం కొండపాలెంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టానికి’ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి వైసీపీ ప్రజలను మోసం చేసిందన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గుములూరు చంద్రమౌళి, ఉపాధ్యక్షుడు బంటు చిరంజీవి, బంటు శ్రీను, పంచాడ చంద్ర, లగుడు అప్పలనాయుడు, సుర్ల బాబులు నాయుడు పాల్గొన్నారు.
వైసీపీ పాలనలో ప్రజలకు ఇబ్బందులు : పీవీజీ కుమార్
దేవరాపల్లి: వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అవి తొలగాలంటే చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయాలని తెలుగుదేశం పార్టీ మాడుగుల నియోజకవర్గ ఇన్చార్జి పీవీజీ కుమార్ అన్నారు. గురువారం రాత్రి మండలంలోని ఎం.అలమండలో ‘ఇదేం కర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ఉన్న నియోజకవర్గంలో ఇసుక దందా జరుగుతుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక ట్రాక్టర్ రూ.2 వేలు ఉంటే, ప్రస్తుత ప్రభుత్వం రూ.ఆరు వేలుకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు పోతల పాత్రునాయుడు, డి.డినాయుడు, అర్జునరావు, నానాజీ, కర్రి.నాయుడు, సాంబమూర్తి, కడిం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T23:58:34+05:30 IST