ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదినోత్సవం

ABN, First Publish Date - 2022-04-21T06:03:28+05:30

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జన్మది నోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. విశాఖ పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పార్టీ నాయకుడు శ్రీభరత్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్య క్రమంలో బాబు కూర్చున్న భంగి మలోని చిత్రపటాన్ని కుర్చీలో ఉంచి దాని ఎదురుగా కేక్‌ కట్‌ చేశారు

పార్టీ కార్యాయంలో రక్తదానం చేస్తున్న నేతలు, కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పార్టీ కార్యాలయంలో ఘనంగా సంబరాలు 

మహారాణిపేట, ఏప్రిల్‌ 20: తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జన్మది నోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. విశాఖ పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పార్టీ నాయకుడు శ్రీభరత్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్య క్రమంలో బాబు కూర్చున్న భంగి మలోని చిత్రపటాన్ని కుర్చీలో ఉంచి దాని ఎదురుగా కేక్‌ కట్‌ చేశారు అనంతరం కేక్‌ను తొలుత బాబు చిత్రపటానికి పెట్టి అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యాల యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 50 మంది కార్యకర్తలు, అభి మానులు రక్తదానం చేశారు. అనం తరం పల్లా శ్రీనివాసరావు మాట్లా డుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా ప్రతీనాయకుడు, కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని అన్నారు. మూడేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో పరిస్థితి దిగజారిందని, ప్రజలపై అన్ని విధాలా భారంపడి వా టరు విసిగిపోయి ఉన్నారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసు కోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్య క్రమంలో దక్షిణ నియోజకవర్గం పార్టీ ఇన్‌చార్జి గండి బాబ్జీ, కార్యదర్శి పాశర్ల ప్రసాద్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్‌ నజీర్‌, ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు, ఈతలపాక సుజాత, కేదారి లక్ష్మి, గనగళ్ల సత్య తదితరులు పాల్గొన్నారు.   


అధినేతకు గండి బాబ్జీ శుభాకాంక్షలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు అమరావతిలోని పార్టీ కార్యాలయంలో విశాఖ దక్షిణ ఇన్‌ చార్జి గండి బాబ్జీ మంగళవారం రాత్రి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేప ట్టిన పాదయాత్ర, బాదుడే బాదుడు పేరిట ఆందోళన కార్యక్రమాలకు లభించిన స్పందనపై బాబుకు వివరించారు. దీంతో బాబ్జీని చంద్రబాబు అభినందించి ప్రభుత్వ వ్యతిరేక కార్య కమాలపై విస్తృత ప్రచారం చేయడం తోపాటు కేడర్‌ను సమన్వయం చేసుకోవాలని సూచించారు.   

Updated Date - 2022-04-21T06:03:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising