ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపించాలి
ABN, First Publish Date - 2022-10-17T07:03:09+05:30
విద్యావంతులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గాడు చినలక్ష్మికుమారిని గెలిపించాలని తెలుగుదేశం పార్టీ మాడుగుల నియోజకవర్గం ఇన్‌చార్జి పీవీజీ కుమార్ పిలుపునిచ్చారు.
టీడీపీ మాడుగుల నియోజకవర్గం ఇన్‌చార్జి పీవీజీ కుమార్
కె.కోటపాడు, అక్టోబరు 16: విద్యావంతులందరూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గాడు చినలక్ష్మికుమారిని గెలిపించాలని తెలుగుదేశం పార్టీ మాడుగుల నియోజకవర్గం ఇన్‌చార్జి పీవీజీ కుమార్ పిలుపునిచ్చారు. మండలంలోని సూదివలసలో ఆదివారం సాయంత్రం జరిగిన పట్టభద్రుల ఓటర్లు నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మేధావులుదేనని అన్నారు. రాష్ట్రం ఆర్థిక మాధ్యంలోకి వెళ్లిపోయిందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశంపార్టీ మళ్లీ అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సబ్బవరపు రామునాయుడు, కసిరెడ్డి అప్పలనాయుడు, జూరెడ్డి రాము, లెక్కల అవతారం, యడ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-17T07:03:09+05:30 IST