ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ అరాచకాలను అరికట్టండి

ABN, First Publish Date - 2022-11-19T01:13:34+05:30

వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న అరాచకాలపై గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని తెలుగుదేశం పార్టీ మాడుగుల నియోజకవర్గం పరిశీలకులు లొడగల కృష్ణ పిలుపునిచ్చారు.

ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న పార్టీ పరిశీలకులు కృష్ణ, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేవరాపల్లి, నవంబరు 18: వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేస్తున్న అరాచకాలపై గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలని తెలుగుదేశం పార్టీ మాడుగుల నియోజకవర్గం పరిశీలకులు లొడగల కృష్ణ పిలుపునిచ్చారు. మండలంలోని తిమిరాంలో శుక్రవారం పార్టీ మండల అధ్యక్షుడు చిటిమిరెడ్డి సూర్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో వైసీపీ వారి అరాచకాలను ప్రతి కార్యకర్త ఎండగట్టాలన్నారు. రాష్ట్రంలో బీసీలకు న్యాయం చేసింది ఒక్క తెలుగుదేశం పార్టీయేనని అన్నారు. జగన్‌ రెడ్డి, విజయసాయిరెడ్డి గజదొంగల్లా రాష్ట్రాన్ని దోచుకుతుంటున్నారని, ప్రభుత్వ భూములను దోచేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో టీడీపీని గెలిపించుకొని చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసే బాధ్యత మనందరిపై ఉందన్నారు. పార్టీ ఇన్‌చార్జి పీవీజీ.కుమార్‌ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పార్టీని గెలిపించుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు మాట్లాడుతూ, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే అందరికీ గౌరవం దక్కుతుందన్నారు. పార్టీలో ఎటువంటి గ్రూపులు లేకుండా అందరూ ఒకే తాటిపై నడవాలన్నారు. అంతకుముందు స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చెరకాన సూర్యనారాయణ, సర్పంచ్‌ ఆదిరెడ్డి వరలక్ష్మి, పార్టీ నాయకులు సాంబమూర్తి, ఈశ్వరరావు, చల్లా నానాజీ, పోతుల పాత్రునాయుడు, గొర్రుపోటు నరసింహమూర్తి, కొమర బాబూరావు, బండారు రామారావు, ఎంపీటీసీ మాజీ సభ్యులు, మాజీ సర్పంచ్‌లు, పార్టీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-19T01:13:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising