అవినీతి, అక్రమాలపై ప్రశ్నిస్తున్నందునే తప్పడు కేసులు
ABN, First Publish Date - 2022-11-05T01:18:18+05:30
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌నెడ్డి, వైసీపీ నాయకులు అవినీతి, భూకబ్జాలను ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి అయ్యన్నపై అక్రమ కేసులు బనాయిస్తు న్నారని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు.
నర్సీపట్నం అర్బన్/ గొలుగొండ, నవంబరు 4: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌నెడ్డి, వైసీపీ నాయకులు అవినీతి, భూకబ్జాలను ప్రశ్నిస్తున్న మాజీ మంత్రి అయ్యన్నపై అక్రమ కేసులు బనాయిస్తు న్నారని తెలుగుదేశం పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు,కుమారుడు రాజేష్ బెయిల్‌పై వచ్చిన తర్వాత శుక్రవారం నర్సీపట్నంలో అయ్యన్నను పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. అర్థరాత్రి అయ్యన్న ఇంటిని సీఐడీ అధికారులు, 300 మంది పోలీసులు చుట్టుముట్టి గోడను పగలగొట్టి టెర్రరిస్ట్‌ను అరెస్టు చేసినట్టు హడావిడి చేయడం తగదన్నారు. మద్యం మత్తులో సీఐడీ పోలీసులు దౌర్జన్యంగా ఇంటిలోకి ప్రవేశించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం నాయకులు గుమ్మడి సంధ్యారాణి, బుద్ద భువనేశ్వరరావు, లాలం కాశీనాయుడు, కూండ్రపు కన్నయ్యనాయుడు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-05T01:18:20+05:30 IST