ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒడిస్సీ నృత్య కళాకారిణికి స్వర్ణకమలం బహూకరణ

ABN, First Publish Date - 2022-08-14T06:12:33+05:30

వైభవ్‌ జ్యూవెలర్స్‌ ఎల్లప్పుడూ సాంస్కృతిక, సంప్రదాయ కళలను పోత్సహిస్తుందని వైభవ్‌ జ్యూవెలర్స్‌ హోల్‌టైం డైరెక్టర్‌ గ్రంధి సాయికీర్తన అన్నారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా దేశంలో ప్రసిద్ధి చెందిన కళాకారులకు స్వర్ణకమలం బహూకరిస్తూ వారిని సత్కరిస్తున్నది. ఇందులో భాగంగా శనివారం విశాఖ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడమీ కళాభారతిలో నిర్వహించిన నేషనల్‌ ఎమినెన్స్‌ అవార్డు ఫంక్షన్‌ -2022లో ప్రముఖ ఒడిస్సీ, క్లాసికల్‌ నృత్యకళాకారిణి, పద్మవిభూషణ్‌ డాక్టర్‌ సోనాల్‌మాన్‌సింగ్‌కు స్వర్ణకమలాన్ని బహూకరించారు.

ఒడిస్సీ నృత్య కళాకారిణి డాక్టర్‌ సోనాల్‌ మాన్‌సింగ్‌కు స్వర్ణకమలం బహూకరిస్తున్న వైభవ్‌జ్యూయలర్‌ హోల్‌టైం డైకెక్టర్‌ గ్రంధిసాయికీర్తన తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం/ మద్దిలపాలెం, ఆగస్టు 13: వైభవ్‌ జ్యూవెలర్స్‌ ఎల్లప్పుడూ సాంస్కృతిక, సంప్రదాయ కళలను పోత్సహిస్తుందని వైభవ్‌ జ్యూవెలర్స్‌ హోల్‌టైం డైరెక్టర్‌ గ్రంధి సాయికీర్తన అన్నారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతలో భాగంగా దేశంలో ప్రసిద్ధి చెందిన కళాకారులకు స్వర్ణకమలం బహూకరిస్తూ వారిని సత్కరిస్తున్నది. ఇందులో భాగంగా శనివారం విశాఖ మ్యూజిక్‌ అండ్‌ డ్యాన్స్‌ అకాడమీ  కళాభారతిలో నిర్వహించిన నేషనల్‌ ఎమినెన్స్‌ అవార్డు ఫంక్షన్‌ -2022లో ప్రముఖ ఒడిస్సీ, క్లాసికల్‌ నృత్యకళాకారిణి, పద్మవిభూషణ్‌ డాక్టర్‌ సోనాల్‌మాన్‌సింగ్‌కు స్వర్ణకమలాన్ని బహూకరించారు.  ఈ సందర్భంగా సాయికీర్తన మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించడంలో వైభవ్‌ జ్యూవెలర్స్‌ ముందుంటుందన్నారు.   ఈకార్యక్రమంలో తూర్పు నావికాదళం కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌ గుప్తా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు అకాడమీ 36వ వార్షికోత్సవం సందర్భంగా సోనాల్‌మాన్సింగ్‌కు నాట్య విద్యాభారతి బిరుదు ప్రదానం చేశారు. అవార్డు గ్రహీత సోనాల్‌ మాన్సింగ్‌ మాట్లాడుతూ ఎన్నో అవార్డులు బిరుదులు అందుకున్న తనకు నాట్యవిద్యాభారతి బిరుదు ప్రత్యేకంగా నిలిచిందన్నారు. అనంతరం ఆమె బృందంతో ప్రదర్శించిన కళారూపాలు అబ్బురపరిచాయి. ఈ కార్యక్రమంలో వైభవ్‌ జ్యూవలర్స్‌ ప్రతినిధులు, అకాడమీ నిర్వహకులు రాంబాబు, మంతెన సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-14T06:12:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising