ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిధుల కోసం సర్పంచ్‌ దీక్ష

ABN, First Publish Date - 2022-10-17T06:24:10+05:30

పంచాయతీకి నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మండలంలోని దారెల పంచాయతీ గన్నెడ గ్రామంలో ఆ పంచాయతీ సర్పంచ్‌ పి.పాండురంగ స్వామి ఆదివారం ప్రజా చైతన్య దీక్ష చేపట్టారు.

గన్నెడలో దీక్ష చేపడుతున్న సర్పంచ్‌ పాండురంగస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఖాతాలో జమ చేసే వరకు ఆందోళన కొనసాగిస్తానని వెల్లడి


ముంచంగిపుట్టు, అక్టోబరు 16: పంచాయతీకి నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ మండలంలోని దారెల పంచాయతీ గన్నెడ గ్రామంలో ఆ పంచాయతీ సర్పంచ్‌ పి.పాండురంగ స్వామి ఆదివారం ప్రజా చైతన్య దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి మంజూరు చేసిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించడం దారుణమన్నారు. పంచాయతీ ఖాతాలో నిధులు లేక గ్రామాల్లో సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలిపారు. నిధులు ఇచ్చే వరకు తమ పంచాయతీ పరిధిలో అన్ని గ్రామాల్లో  ప్రజా చైతన్య దీక్షను చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం తీరును ప్రజలకు వివరిస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో  వార్డు మెంబర్లు, ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-17T06:24:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising