ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లేబర్‌ కోడ్స్‌ రద్దు చేసే వరకు పోరాటం

ABN, First Publish Date - 2022-08-09T07:12:24+05:30

కార్మికులకు నష్టం చేసే విధంగా ఉన్న లేబర్‌ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

సీఐటీయూ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్‌

మహారాణిపేట, ఆగస్టు 8: కార్మికులకు నష్టం చేసే విధంగా ఉన్న లేబర్‌ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కేఎస్‌వీ కుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం సీఐటీయూ కార్యలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను యాజమాన్యాలకు అనుకూలంగా, కార్మికులకు నష్టం చేసే విదంగా నాలుగు లేబర్‌ కోడ్స్‌ను తీసుకువచ్చిందని వివరించారు.  దీనివల్ల కార్మికులకు  సంఘం ఏర్పాటు చేసుకొనే హక్కు, సమ్మే చేసే హక్కులకు భంగం వాటిల్లుతుందని తెలిపారు. సైన్యంలో ఇప్పడు చేపడుతున్న అగ్నిపథ్‌ విధానం కూడా ఇందులో భాగమేనని వివరించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను రద్దు చేసే హక్కు ఏ ప్రభుత్వానికీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-09T07:12:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising