ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాన్ని ఆపాల్సిందే..

ABN, First Publish Date - 2022-01-27T06:19:00+05:30

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌తో పాటు ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆపాల్సిందేనని, ఇందుకోసం ఎన్ని నెలలైనా పోరాటాన్ని ఉధృతంగా చేస్తామని విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్‌ ఎం.జగ్గునాయుడు స్పష్టం చేశారు.

ప్రదర్శనలో పాల్గొన్న జేఏసీ నాయకులు, తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్‌ జగ్గునాయుడు 

సిరిపురం, జనవరి 26: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌తో పాటు ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆపాల్సిందేనని, ఇందుకోసం ఎన్ని నెలలైనా పోరాటాన్ని ఉధృతంగా చేస్తామని విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్‌ ఎం.జగ్గునాయుడు స్పష్టం చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 300వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ విశాఖ ఉక్కు అమ్మకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని విశాఖతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం ప్రక్రియను నిలిపివేసి ‘ఉక్కు’కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ముందుగా జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య చిత్రం, జాతీయ జెండాలతో రూపొందించిన పబ్లిక్‌ సెక్టార్‌ శకటంతో దీక్షా శిబిరం నుంచి అంబేడ్కర్‌ విగ్రహం, ఆర్టీసీ కాంప్లెక్స్‌, ఆశీలమెట్ట జంక్షన్‌ మీదుగా ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు జి.శ్రీనివాసరావు, పి.రమణ, నాగభూషణం, వెంకటేశ్వర్లు, రామ్మోహనరావు, జగన్‌, వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-27T06:19:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising