ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీవోఏలపై వేధింపులు అరికట్టండి

ABN, First Publish Date - 2022-12-31T01:25:43+05:30

పట్టణంలో రెండు రోజులుగా జరుగుతున్న వెలుగు వీవోఏల రాష్ట్ర మహాసభలు శుక్రవారం ముగిశాయి.

మహాసభల ముగింపోత్సవంలో మాట్లాడుతున్న ధనలక్ష్మి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనకాపల్లి టౌన్‌, డిసెంబరు 30 : పట్టణంలో రెండు రోజులుగా జరుగుతున్న వెలుగు వీవోఏల రాష్ట్ర మహాసభలు శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి మాట్లాడుతూ మూడేళ్ల కాలపరిమితి సర్క్యూలర్‌కు వ్యతిరేకంగా జనవరి ఆరో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. అలాగే వీవోఏలపై వేధింపులను, దళితులు, గిరిజనులు, మైనార్టీల మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని మహాసభ ఏకగ్రీవంగా తీర్మానాలను ఆమోదించింది. రాష్ట్ర అధ్యక్షురాలు సీహెచ్‌.రూపాదేవి, జిల్లా గౌరవాధ్యక్షుడు వీవీ శ్రీనివాసరావులు వీవోఏల సమస్యలపై ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ప్రతినిధులు ఆర్‌.శంకరరావు, జి.కోటేశ్వరరావులతో పాటు పెద్ద సంఖ్యలో వెలుగు వీవోఏలు పాల్గొన్నారు. ఇదిలావుంటే, వీవోఏల మహాసభల సందర్భంగా సంఘ రాష్ట్ర కమిటీ 55 మందితో ఎన్నికైంది. వీరిలో 13 మంది ఆఫీస్‌ బేరర్స్‌గా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులుగా సీహెచ్‌.రూపాదేవి, ప్రధానకార్యదర్శిగా కె.ధనలక్ష్మి, కోశాధికారిగా ఎ.తిరుపతయ్య ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా వి.నిర్మ లమ్మ, కృష్ణమ్మ, రెడ్డప్ప, సోమన్న, కె.లక్ష్మి, ఉమాదేవి, ఎల్‌వీ రాజ్‌కుమార్‌, వి.నాగనిర్మల, కార్యదర్శులుగా రజిని, రామకృష్ణ, నాగరాజు, సుంకన్న, పరంజ్యోతిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Updated Date - 2022-12-31T01:25:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising