ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర ప్రగతి చంద్రబాబుతోనే సాధ్యం

ABN, First Publish Date - 2022-07-01T06:40:19+05:30

రాష్ట్రం ప్రగతి పథాన నడవాలన్నా, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు.

బాదుడే బాదుడులో కాగడాలతో టీడీపీ శ్రేణుల ప్రదర్శన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


- జగన్‌రెడ్డి పాలనలో మత్స్యకారులకు తీరని అన్యాయం

- కాలుష్య జలాలతో మత్స్య సంపద మృత్యువాత పడుతున్నా పట్టని వైనం

- పూడిమడక ‘బాదుడే బాదుడు’లో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ‘బుద్ద’   

అచ్యుతాపురం, జూన్‌ 30 : రాష్ట్రం ప్రగతి పథాన నడవాలన్నా, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలన్నా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని టీడీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు అన్నారు. గురువారం రాత్రి పూడిమడకలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమంలో మాట్లాడారు. జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రంలో ప్రజలు అన్ని హక్కులు కోల్పోయారన్నారు. అన్యాయం అని ప్రశ్నిస్తే తప్పుడుకేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. అన్నింటి ధరలు పెరిగి సామాన్య, మధ్య తరగతి ప్రజలు బతికి బట్టకట్టలేని దుస్థితి నెలకొందని ఆరోపించారు.  సెజ్‌ కర్మాగారాల్లో కాలుష్య జలాల వల్ల మత్స్య సంపద మృత్యువాత పడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారన్నారు.  వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఇచ్చే పారితోషికాన్ని వివిధ సాకులు చూపి కొందరికే ఇచ్చారన్నారు.  అనంతరం గ్రామంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ సీనియర్‌ నాయకుడు, పూడిమడక మాజీ సర్పంచ్‌ మేరుగు బాపునాయుడు ఆధ్వర్యంలో జరిగి ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, సీనియర్‌ నాయకుడు లాలం భాస్కరరావు, ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు రాజాన రమేష్‌కుమార్‌, ధూళి రంగనాయకులు, పార్టీ మండల అధ్యక్షుడు జనపరెడ్డి నర్శింగరావు, పొన్నమళ్ల కొండబాబు, పతివాడ చిన్నంనాయుడు, నీరుకొండ నర్శింగరావు, కె.రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-01T06:40:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising