ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి

ABN, First Publish Date - 2022-12-07T01:37:07+05:30

తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి, ఆపార్టీ పెందుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి బండారు సత్యనారా యణమూర్తి అన్నారు. మండలంలోని మొగలిపురంలో మంగళవారం గ్రామ దేవత బండమ్మకు పూజలు నిర్వహించిన అనంతరం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని చేపట్టారు.

మొగలిపురంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్బవరం, డిసెంబరు 6: తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ మంత్రి, ఆపార్టీ పెందుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి బండారు సత్యనారా యణమూర్తి అన్నారు. మండలంలోని మొగలిపురంలో మంగళవారం గ్రామ దేవత బండమ్మకు పూజలు నిర్వహించిన అనంతరం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడున్నరేళ్ల జగన్‌మోహన్‌రెడ్డి పాలనతో రాష్ట్రం సర్వనాశనం అయ్యిందన్నారు. టీడీపీ హయాంలో 145 సంక్షేమ పథకాలు అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు బాసటగా నిలిచినట్టు చెప్పారు. అధికార వైసీపీకి చెందిన సర్పంచులే ధర్నాలు చేస్తున్నారంటే.. రాష్ట్రంలో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చునన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక్కడ ప్రగల్భాలు పలకడమే తప్ప, సీఎం జగన్‌ ముందు మాట్లాడే పరిస్థితి లేదన్నారు. రాయలసీమలో చంద్రబాబుకు జనం బ్రహ్మరథం పడుతుండడంతో జగన్‌మోహన్‌రెడ్డిలో వణుకు పుట్టిందన్నారు. వ్యవస్థలన్నీ మళ్లీ బాగుపడాలంటే అంతా కలిసి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మాజీ ఎంపీటీసీ గండి రవికుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బర్నికాన బాబూరావు, తమరాన బంగారునాయుడు, సన్యాసమ్మ, అంగటి నానాజీ, ఎం.మహాలక్ష్మీనాయుడు, గండి దేముడు, ముత్యలనాయుడు, దెడ్డం ప్రసాద్‌, కొటా న అప్పారావు, గవర అప్పారావు, కన్నం నాయుడు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T01:37:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising