ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ-నాందేడ్‌ మధ్య ప్రత్యేక రైలు

ABN, First Publish Date - 2022-05-21T04:35:29+05:30

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ మరో రెండు ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. వీటిని విశాఖ-నాందేడు, సికింద్రాబాద్‌-కటక్‌ వయా విశాఖ మధ్య సింగిల్‌ ట్రిప్పు (రానుపోను) ప్రత్యేక రైళ్లుగా నడపనున్నట్లు సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సికింద్రాబాద్‌-కటక్‌ వయా విశాఖ మీదుగా మరో రైలు

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే అధికారుల నిర్ణయం

విశాఖపట్నం, మే 20: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ మరో రెండు ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. వీటిని విశాఖ-నాందేడు, సికింద్రాబాద్‌-కటక్‌ వయా విశాఖ మధ్య సింగిల్‌ ట్రిప్పు (రానుపోను) ప్రత్యేక రైళ్లుగా నడపనున్నట్లు సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. విశాఖ నుంచి 07083 నంబరు ప్రత్యేక రైలు ఈనెల 22న (ఆదివారం) సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి మర్నాడు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది.


అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.10 గంటలకు నాందేడుకు చేరుతుంది. ఈ రైలులో రెండు సెకండ్‌ ఎసీ, ఐదు థర్డ్‌ ఏసీ, ఏడు స్లీపర్‌, రెండు జనరల్‌, ఒక జనరల్‌ కమ్‌ లగేజీ కమ్‌ దివ్యాంగుల కోచ్‌లుంటాయి. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్‌, ఖాజీపేట, సికింద్రాబాద్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, బాసర మీదుగా నాందేడ్‌కు చేరుతుంది.


అలాగే, 07581 నంబరు ప్రత్యేక రైలు ఈనెల 21న (శనివారం) ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి అదేరోజు రాత్రి 9.10 గంటలకు విశాఖ చేరుతుంది. ఇక్కడ నుంచి 9.30 గంటలకు బయలుదేరి మర్నాడు ఉదయం 6.15 గంటలకు కటక్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 07582 నంబరు ప్రత్యేక రైలు ఈనెల 22న సాయంత్రం 6.55 గంటలకు కటక్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం తెల్లవారు జామున 3.35 గంటలకు విశాఖ చేరుతుంది.


తిరిగి ఇక్కడ నుంచి తెల్లవారు జామున 3.55 గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం 5.20 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. ఈ సర్వీసులకు ఫస్ట్‌ ఏసీ కమ్‌ సెకండ్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీ, జనరల్‌ క్లాసు కోచ్‌లు అందుబాటులో వుంటాయి. 

Updated Date - 2022-05-21T04:35:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising