ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలో అస్త్రాల విశిష్టతతో గ్రాఫిక్‌ సినిమా

ABN, First Publish Date - 2022-12-07T23:51:21+05:30

భారతీయ పురాణాల్లో చెప్పిన అస్త్రాల విశిష్టతను ప్రస్తుత సమాజానికి తెలియజేసే విధంగా పూర్తి గ్రాఫిక్స్‌ వినియోగిస్తూ భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సింహాచలం, డిసెంబరు 7 : భారతీయ పురాణాల్లో చెప్పిన అస్త్రాల విశిష్టతను ప్రస్తుత సమాజానికి తెలియజేసే విధంగా పూర్తి గ్రాఫిక్స్‌ వినియోగిస్తూ భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ తెలిపారు. బుధవారం ఆయన వరాహలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ మన శాస్త్రాలు, పురాణాల్లో చెప్పిన బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, తదితర పలు అస్ర్తాల ఆధారంగా జర్మనీలో ప్రయోగాలు జరుగుతున్నాయని, వాటి ఆధారంగా పూర్తి గ్రాఫిక్‌తో సినిమా తీయనున్నట్టు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన స్ర్కిప్ట్‌ వర్కు జరుగుతోందన్నారు. అలాగే ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్‌, మీనా కలిసి ఎస్‌వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో నటించిన ’ఆర్గానిక్‌ మామ - హైబ్రీడ్‌ అల్లుడు’ సినిమా చిత్రీకరణ పూర్తయిందని, ఈనెలలో విడుదల చేస్తామని తెలిపారు. ఎన్నికల తరువాత నందమూరి బాలకృష్ణతో మరో సినిమా నిర్మించేందుకు సన్నాహాలు పూర్తి చేశానన్నారు. ’మా’ గురించి మాట్లాడుతూ ఎన్నికల్లో చెప్పినట్టు అధ్యక్షుడు మంచు విష్ణు సారధ్యంలో పేద సినీ కార్మికులకు పింఛన్లు, ఇళ్లు మంజూరు చేస్తున్నామని చెప్పారు. విష్ణు ఆధ్వర్యంలో ’మా’ పనితీరు బాగుందన్నారు.

Updated Date - 2022-12-07T23:51:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising