ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన సోము వీర్రాజు

ABN, First Publish Date - 2022-03-15T20:07:11+05:30

ఎన్నికల్లో పొత్తుల విషయంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ఎన్నికల్లో పొత్తుల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు స్పందించారు. ఈ సందర్భంగా మంగళవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ పొత్తులపై బీజేపీ అధిష్టానంతో పవన్ మాట్లాడతారని చెప్పారు. అమిత్‌షా తమకు 2 నెలల క్రితమే రూట్ మ్యాప్ ఇచ్చారని, ఆయన ఆదేశం ప్రకారమే జనసేనతో కలిసి వైసీపీపై పోరాటం చేస్తున్నామని చెప్పారు.

 

రాష్ట్రంలో దుర్మార్గ ప్రభుత్వం నడుస్తోందని సోమువీర్రాజు విమర్శించారు. సీఎం జగన్ రూ.5 వేల కోట్లు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. 20 లక్షల ఇళ్లు ఇస్తే.. వాటికి రూ.30 వేల కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు.. ఏ రాష్ట్రానికి ఇవ్వలేదన్నారు. 2024లో జనసేనతో కలిసి అధికారంలోకి రావాలన్నదే తమ లక్ష్యమన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఎలా అన్న మీడియా ప్రశ్నకు సోమువీర్రాజు దాటవేశారు. కేంద్ర పార్టీ ప్రతినిధులతో పవన్ అన్ని విషయాలు మాట్లాడతారని సోమువీర్రాజు అన్నారు.

Updated Date - 2022-03-15T20:07:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising